ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నేడు విజయవాడలో మహిళల ఆత్మగౌరవ దీక్ష: అనిత

ABN, First Publish Date - 2023-07-21T03:28:01+05:30

ష్ట్రంలో మహిళల ఆత్మగౌరవానికి భంగం కలుగుతున్న నేపథ్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో శుక్రవారం దీక్ష నిర్వహించనున్నట్టు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తెలిపారు.

మహారాణిపేట (విశాఖపట్నం), జూలై 20: రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవానికి భంగం కలుగుతున్న నేపథ్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో శుక్రవారం దీక్ష నిర్వహించనున్నట్టు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తెలిపారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘ఈ దీక్షకు అన్ని పార్టీల మహిళా నేతలను ఆహ్వానించాం. సైకో సీఎం జగన్‌ పరిపాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయి. గత నాలుగేళ్లలో జాతీయ నేర నివేదిక ప్రకారం రాష్ట్రంలో మహిళలపై 1,14,356 దాడులు, అకృత్యాలు జరిగాయి. ఇవి కాకుండా వలంటీర్ల వేధింపులకు సంబంధించి 4,320 కేసులు నమోదయ్యాయి. కొద్దికాలంగా హోం మంత్రి బయటకు రావడం లేదు. ఆమె కనిపించడం లేదని ప్రజలు డీజీపీకి ఫిర్యాదు చేయాలి. రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉందని డీజీపీతో సాక్షాత్తూ ముఖ్యమంత్రే అబద్ధాలు చెప్పిస్తున్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతున్నామనే మాపై సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. సీఎం సతీమణి భారతి ఒక్కరే మహిళ కాదని, మిగిలిన వారు కూడా మహిళలేనని పోలీసులు తెలుసుకోవాలి’’ అని అనిత అన్నారు. ఈ సందర్భంగా ఆత్మగౌరవ దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో తెలుగు మహిళ జిల్లా నేతలు పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-21T03:33:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising