ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17న జిల్లాలోకి యువగళం పాదయాత్ర

ABN, First Publish Date - 2023-03-02T23:25:54+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ చెపట్టిన యువగళం పాదయాత్ర ఈనెల 17వ తేదీన శ్రీసత్యసాయి జిల్లాలోకి ప్రవేశించనున్నట్లు మాజీ మంత్రి, యాత్ర రాయలసీమ జోనల్‌ ఇనచార్జి అమరనాథ్‌ రెడ్డి వెల్లడించారు.

మాట్లాడుతున్న మాజీ మంత్రి అమరనాథ్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మాజీ మంత్రి అమరనాథ్‌ రెడ్డి

కదిరి, మార్చి 2: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ చెపట్టిన యువగళం పాదయాత్ర ఈనెల 17వ తేదీన శ్రీసత్యసాయి జిల్లాలోకి ప్రవేశించనున్నట్లు మాజీ మంత్రి, యాత్ర రాయలసీమ జోనల్‌ ఇనచార్జి అమరనాథ్‌ రెడ్డి వెల్లడించారు. పట్టణంలోని పీవీఆర్‌ ఫంక్షన హాల్‌లో గురువారం ఏర్పాటు చేసిన టీడీపీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం చీకటిమానుపల్లికి ఈనెల 17న పాదయాత్ర చేరుకుంటుందన్నారు. టీడీపీకి చెందిన అన్ని విభాగాలు పాదయాత్రలో మమేకమై జయపద్రం చేయాలని పిలుపునిచ్చారు. యువగళం పాదయాత్రకు మంచి స్పందన వస్తోందనీ, రోజురోజుకీ ప్రజల మద్దతు పెరుగుతోందన్నారు. సీఎం జగన.. అన్నివర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాకుండా అడ్డుకుని, నిరుద్యోగులకు తీరని ద్రోహం చేశారన్నారు. దీంతో అన్నివర్గాలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో యువగళం పాదయాత్రను సమష్టిగా పనిచేసి, జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌, మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, కదిరి, ధర్మవరం, మడకశిర నియోజకవర్గాల ఇనచార్జిలు కందికుంట వెంకటప్రసాద్‌, పరిటాల శ్రీరామ్‌, ఈరన్న, నేతలు అంబికా లక్ష్మీనారాయణ, సవితమ్మ, పర్వీనబాను పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T23:25:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!