ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలను పరిష్కరిస్తారా..?

ABN, First Publish Date - 2023-05-16T01:27:19+05:30

జిల్లా సర్వజన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం మంగళవారం ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ గౌతమి ఈ సమావేశాన్ని ఈసారి సూపర్‌ స్పెషాలిటీలో ఏర్పాటు చేశారు.

ఏఎంసీలో ఉక్కపోతకు తట్టుకోలేక ఇంటినుంచి తెచ్చుకున్న ఫ్యానతో ఉపశమనం పొందుతున్న రోగి ( ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం

కొత్త కలెక్టర్‌ ఆధ్వర్యంలో తొలిసారి..

అనంతపురం టౌన, మే 15: జిల్లా సర్వజన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం మంగళవారం ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ గౌతమి ఈ సమావేశాన్ని ఈసారి సూపర్‌ స్పెషాలిటీలో ఏర్పాటు చేశారు. నిబంధనల మేరకు మూడు నెలలకు ఒకసారి ఈ సమావేశం జరగాలి. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలకు ఆమోదం తెలపాలి. కానీ ఈసారి ఆలస్యంగా సమావేశం జరుగుతోంది. గత కలెక్టర్‌ నాగలక్ష్మి ఉన్నప్పుడు కమిటీ మీటింగ్‌ జరగాల్సి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం, ఆ తర్వాత కలెక్టర్‌ బదిలీ జరగడంతో సమావేశం ఆగిపోయింది. తాజాగా కొత్త కలెక్టర్‌ గౌతమి జిల్లాకు వచ్చారు. ఆమె ఆధ్వర్యంలో తొలిసారిగా సమావేశం జరుగుతోంది. ఆస్పత్రిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఏసీలు, సీసీ కెమెరాలు పనిచేయవు, ఫ్యానలు తిరగవు. రోగులను తరలించేందుకు వీల్‌చైర్‌, సె్ట్రచర్స్‌ లేవు. ఇరుకుగా ఉన్న ఓపీ కేంద్రాలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ల్యాబ్‌లలో యంత్రాలు, పరికరాలు సక్రమంగా పనిచేయడం లేదు. రక్తపరీక్షలు మ్యానువల్‌గా చేస్తున్నారు. సీనియర్‌ వైద్యులు సమయ పాలన పాటించడం లేదు. ఏఎంసీ, క్యాజువాలిటీలో అవసరం మేరకు పడకలు లేవు. దీంతో కొందరు రోగులు ప్రాణాలు కోల్పోయారు. గత సమావేశాల్లో వీటిపై చర్చ జరిగినా, తగిన చర్యలు తీసుకోలేదు. కొత్త కలెక్టర్‌ అయినా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతారా అన్న చర్చ జరుగుతోంది.

Updated Date - 2023-05-16T01:27:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising