బాబుకు అండగా ఉంటాం: టీ డీపీ నేతలు
ABN, First Publish Date - 2023-09-23T00:23:40+05:30
చంద్రబాబు నాయుడుకు అండగా ఉందామని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు.
హిందూపురం, సెప్టెంబరు 22: చంద్రబాబు నాయుడుకు అండగా ఉందామని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. తూముకుంట పారిశ్రామికవాడలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గార్మెంట్ కార్మికులతో కలిసి గోళ్లాపురం రహదారి నుంచి బెంగళూరుకు వెళ్లే రహదారి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ అరె్‌స్టఅని తెలిసినా ఈ ప్రభుత్వం సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నదన్నారు. ప్రజలు ఛీ కొడుతున్నా బుద్ది రాలేదన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రతి ఒక్కరూ బాబుకు అండగా నిలవాలన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే, పరిశ్రమలు రావాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కొల్లకుంట అంజినప్ప, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, బీసీసెల్ రాష్ట్రప్రధాన కార్యదర్శి బేవనహళ్లి ఆనంద్, మాజీ మునిసిపల్ చైర్మన అనీల్‌కుమార్, రామాంజినమ్మ పాల్గొన్నారు.
Updated Date - 2023-09-23T00:23:40+05:30 IST