ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత రీడర్ల సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తాం

ABN, First Publish Date - 2023-03-31T00:00:12+05:30

జగన ప్రభుత్వం విద్యుత రీడర్లను నిండా ముం చిందని, శాశ్వత పరిష్కారం చూపుతామని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విద్యుత రీడర్ల సంఘం ప్రతినిధులతో నారా లోకేశ

పెనుకొండ రూరల్‌, మార్చి 30: జగన ప్రభుత్వం విద్యుత రీడర్లను నిండా ముం చిందని, శాశ్వత పరిష్కారం చూపుతామని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ అన్నారు. గురువారం పాదయాత్రలో భాగంగా మండలంలోని గుట్టూరు వద్ద విద్యుత మీటర్‌ రీడర్ల సంఘం నాయకులు నారా లోకేశను కలిసి సమస్యలు వివరించారు. రీ డర్లు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 4500 మంది విద్యుత రీడర్లు 25 ఏళ్లుగా పని చే స్తున్నామన్నారు. పీఎస్‌ రేటు విధానాన్ని రద్దు చేసి, నిర్ధారిత వేతనం అమలు చేస్తామ ని ప్రజాసంకల్ప యాత్రలో జగన హామీ ఇచ్చి, అధికారం చేపట్టాక మాట మరిచారన్నా రు. ప్రభుత్వ చర్యల వల్ల తీవ్రంగా నష్టపోయామని రీడర్లు వాపోయారు. లోకేశ స్పంది స్తూ, మాట తప్పి మడమ తిప్పడం జగనకు పరిపాటిగా మారిందన్నారు. రాష్ట్రంలో ఎ క్సైజ్‌, గనుల శాఖలను తన గుప్పెట్లో పెట్టుకున్నారని, విద్యుత రీడర్లను కూడా తరిమేసి, తనవారిని నియమించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రీడర్లు ఎదుర్కొంటున్న సమస్యలు శాసన మండలిలో సభ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం కోసం కృషిచేస్తామన్నారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే టీడీపీ అధికారంలోకి రాగానే రీడర్లకు న్యాయం చేస్తామని లోకేశ వారికి హామీ ఇచ్చారు.

Updated Date - 2023-03-31T00:00:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising