ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉపాధిలో వసూల్‌ రాజా!

ABN, First Publish Date - 2023-08-17T00:53:43+05:30

ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో పనులు ఉంటాయో... లేదో అవన్నీ నాకు అవసరం లేదు. వారానికి రూ.పది వేలు ఇవ్వాల్సిందే..! మీరు ఏమన్నా చేసుకోండి. నాకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వాల్సిందే. లేదంటే మీరు గ్రామాల్లో చేసే పనులకు పేమేంట్‌లు రావు. మీ ఇష్టం.

ఉపాధి పనుల నమోదు (ఫైల్‌)

వారానికి రూ.10 వేలు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఇవ్వాల్సిందే..!

ఇవ్వకపోతే పేమెంట్‌ బంద్‌

వైసీపీ నేతల అండతో ఎనఆర్‌ఈజీఎస్‌లో హల్‌చల్‌ చేస్తున్న ఓ ఉద్యోగి

బుక్కరాయసముద్రం, ఆగస్టు 16: ‘ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో పనులు ఉంటాయో... లేదో అవన్నీ నాకు అవసరం లేదు. వారానికి రూ.పది వేలు ఇవ్వాల్సిందే..! మీరు ఏమన్నా చేసుకోండి. నాకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వాల్సిందే. లేదంటే మీరు గ్రామాల్లో చేసే పనులకు పేమేంట్‌లు రావు. మీ ఇష్టం. ఎవరికైనా చెప్పుకోండి. నాకేమీ పర్వాలేదు. నాకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉన్నాయి’ అని ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులను ఓ ఉద్యోగి బెదిరిస్తున్నారు. ఎనఆర్‌ఈజీఎ్‌స పథకంలో పని చేస్తున్న ఆ ఉద్యోగి.. కిందిస్థాయి వారిని డబ్బు కోసం వేధిస్తున్నాడని సమాచారం. అవినీతిని అరికట్టాల్సిన ఆ ఉద్యోగి... ‘మీ ఇష్టం మీరు అవినీతి చేసుకోండి.. నాకు మాత్రం వాటా తప్పకుండా ఇవ్వాల్సిందే’ అంటూ పరోక్షంగా ఫీల్డ్‌ అసిస్టెంట్‌ల అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో పనులు జరగలేదు కదా? సార్‌ ఎలా ఇవ్వాలి? అంటే ‘నాకు అవన్నీ తెలియదు. మీరు ఏమి చేస్తారో? నాకు తెలియదు. ఫస్ట్‌ డబ్బులు ఇవ్వాలి. లేదంటే... హార్టీకల్చర్‌ కింద ప్లాంటేషన బిల్లుల పేమెంట్లు నిలిపేస్తా’ అంటూ ఫీల్డ్‌ అసిస్టెంట్లపై పెత్తనం చెలాయిస్తున్నట్లు సమాచారం.

ఆయనంటే హడల్‌..

ఉపాధి హామీ పథకంలో ఆయనది మండలంలో పైస్థాయి కంటే కొంచెం కింది స్థాయి హోదా. ఉన్నత స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఆయన దాటికి భయపడాల్సిందే. ఆయన అధికార పార్టీ నేతల అండదండలు చూసుకోని విచ్చలవిడిగా ప్రవర్తిస్తునట్లు సమాచారం. సాధారణంగా ఈ పథకం కింద గ్రామాల్లో పనులు చేపడితే, ఖచ్చితంగా ఫీల్డ్‌ విజిట్‌ చేయాలి. ఆయన ఫీల్డ్‌ విజిట్‌ చేయకుండానే పనులు సక్రమంగా జరిగినట్లు నివేదిక ఇస్తున్నట్లు తెలిసింది. ఆయన స్థాయి కంటే కిందనున్న మరో ఆరుగురు టీఎలు కూడా గ్రామస్థాయిలో పర్యటించకుండానే అంతా ఎంపీడీఓ కార్యాలయంలోనే పేపర్‌ వర్క్‌ చేసి ముగిస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2023-08-17T00:53:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising