ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అందని ఉపాధి బిల్లులు

ABN, First Publish Date - 2023-08-22T00:01:10+05:30

జాతీయ ఉపాధి హామీ పథకం కింద కష్టపడి పని చేసిన కూలీలకు సకాలంలో బిల్లులు అందకపోవడంతో చాలామంది వలసబాట పడుతున్నారు.

పనులకు తగ్గిన కూలీలు

వలసబాటలో పలువురు

మడకశిర రూరల్‌, ఆగస్టు20: జాతీయ ఉపాధి హామీ పథకం కింద కష్టపడి పని చేసిన కూలీలకు సకాలంలో బిల్లులు అందకపోవడంతో చాలామంది వలసబాట పడుతున్నారు. మండలంలో ఎనిమిది వేల జాజ్‌కార్డులు ఉన్నాయి. అయితే బిల్లలు సకాలంలో చెల్లించక పోవడంలో 800 మంది కూలీలు మాత్రమే పనిచేస్తున్నట్లు అధికారికి లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్న వారికి కూడా రెండున్నర నెలలకు సంబంధించి రూ.10 లక్షలు వరకు కూలీలకు బిల్లులు రావాల్సి ఉంది. బిల్లులు సకాలంలో రాకపోవడంతో కూలీలు పొట్టకూటికోసం పక్క రాష్ట్రం కర్ణాటకకు వలస బాటపడుతున్నారు. క్రమేపి ఉపాధి పనులు తగ్గిపోతున్నాయి. ఉన్నతాధికారలు స్పందించి వెంటనే చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కూలీలు కోరుతున్నారు.

వలసలు వెళ్లడానికి సిద్ధం - అడివప్ప, ఉపాధి కూలీ, గౌడనహళ్ళి

ఎంతో కష్టపడి ఉపాధి పనులు చేస్తున్నాం. అయితే బిల్లుల చెల్లింపులో చాలా అలస్యం జరుగుతందో. దీంతో కుటుంబపోషణ కష్టత రంగా మారింది. నాకు 12 వారాలకు సంబంధించి రూ. 10 వేల బిల్లులు రావల్సి ఉంది. రెండున్నర నెలలు అయినా ఇంత వరకు బిల్లులు రాలేదు. దీంతో కుటుంబపోషణకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బిల్లులు కోసం అనేక సార్లు కార్యాలయాల చూట్టు తిరుగుతున్నా ప్రయోజనంలేకపోతోంది. అధికారులు వెంటనే బిల్లులు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం.

త్వరలో బిల్లులు చెల్లిస్తాం- శ్రీకాంత గౌడ్‌, ఏపీఓ

చేసిన పనులకు సంబంధించి త్వరలో కూలీలకు బిల్లులు చెల్లి స్తాం. కూలీలెవరూ పనులు వదలి వలసలు వెళ్ల వద్దు. అందరూ ఉపాధి పనులకు రావాలి.

Updated Date - 2023-08-22T00:01:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising