జగన పాలనలో అభివృద్ధి శూన్యం
ABN, First Publish Date - 2023-03-02T00:12:42+05:30
ముఖ్యమంత్రి జగనరెడ్డి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల పార్లమెంటు పరిశీలకుడు, మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ విమర్శించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి
మాజీమంత్రి పల్లె, పరిటాల శ్రీరామ్
ధర్మవరం, మార్చి 1: ముఖ్యమంత్రి జగనరెడ్డి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల పార్లమెంటు పరిశీలకుడు, మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బుధ వారం పార్లమెంట్ పరిశీలకులు పల్లెరఘునాథరెడ్డి, ధర్మవరం నియోజక వర్గ పరిశీలకులు వైకుంఠం మల్లికార్జునతో కలిసి పరిటాల శ్రీరామ్ టీడీపీ స్థానిక కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా పరిటాలశ్రీరామ్ మాట్లాడుతూ... నాలుగేళ్లుగా నిరుద్యోగులు, ఉద్యోగులు వైసీపీ పాలనతో ఎదుర్కొంటున్న కష్టాలకు తగిన బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైందన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు, యువత ఉద్యోగాలు లేకపెద్ద ఎత్తున వలసలు వెళ్లారన్నారు. ఈ నా లు గేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన కనిపించలేదన్నారు. విద్యావంతులంతా కలిసి ప్రభుత్వానికి బుద్ధిచెప్పే రోజు వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రతి ఒక్కరు టీడీపీ బలపరచిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాం గోపాల్‌రెడ్డికి ఓటువేయాలని కోరారు. నాయకులు, కార్యకర్తలు ఓటరు న మోదులో ప్రత్యేక చొరవ తీసుకున్నారని, ఇక్కడితో ఆగకుండా అభ్యర్థి విజయానికి కృషి చేయాలన్నారు. మాజీ మంత్రి పల్లె మాట్లాడుతూ...ప్రతి గ్రామంలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చురుకుగా సాగాలన్నారు. ప్రత్యేకించి ధర్మవరం పట్టణంతోపాటు మూడు మండల కేంద్రాల్లోనూ ఈ తొమ్మిది రోజులు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపు నిచ్చారు. వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయని, రానున్నది మన ప్రభుత్వమేనని అన్నారు. ఎవరూ భయపడకుండా ధైర్యంగా పార్టీ గెలుపుకోసం కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చిగిచెర్ల ఓబిరెడ్డి, కమతం కాటమయ్య, పణికుమార్, చింతలపల్లి మహేశచౌదరి, కుణుతూరు వేణుగోపాల్‌రెడ్డి, బోయ రవిచంద్ర, చింతపులుసు పెద్దన్న, పురుషోత్తం గౌడ్, క్రిష్ణాపురం జమీర్‌అహమ్మద్, పోతుకుంటలక్ష్మన్న, అంబటి సనత, గొట్లూరు శీన, మేకల రామాంజి, భీమనేని ప్రసాద్‌నాయుడు, నాగూర్ హుస్సేన, కొత్తపేట ఆది, సాహెబ్బీ, బీబీ పల్లపు రవీంద్ర, రాంపురంశీన, చిన్నూరు విజయ్‌చౌదరి, బొట్టుకిష్ట, కేశగాళ్లశీన తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-02T00:12:42+05:30 IST