జగన పాలనతో విసిగిపోయిన జనం
ABN, First Publish Date - 2023-09-21T23:58:44+05:30
రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగానికి బదులుగా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని, రాష్ట్ర ప్రజలందరూ జగన రెడ్డి పాలనను అసహ్యించుకుంటున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పేర్కొన్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే
పెనుకొండ, సెప్టెంబరు 21 : రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగానికి బదులుగా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని, రాష్ట్ర ప్రజలందరూ జగన రెడ్డి పాలనను అసహ్యించుకుంటున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పేర్కొన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిర సిస్తూ స్థానిక అంబేడ్కర్ సర్కిల్‌వద్ద తొమ్మిదో రోజు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సాధికారికి సమితి సభ్యులు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్ష శిబిరంలో పాల్గొన్న బీకే పార్థసారథి మాట్లాడు తూ.... రాష్ట్రంలో సైకో జగనరెడ్డి పాలన ప్రతి ఒక్కరూ అసహ్యించుకునే స్థాయికి దిగజారిపోయిందన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా రాజా రెడ్డి రాజ్యంగం కొనసాగిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజాస్వా మ్యవాదులు, మేధావులు నడుం బిగించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ప్రస్తుతం ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. అనంత రం మైనార్టీ నాయకులు బీకే పార్థసారథిని ముస్లిం సంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రొద్దం నరసింహులు, కార్యనిర్వాహక కార్యదర్శి మునిమడుగు వెంకట రాముడు, నాయకులు కురుబ కృష్ణమూర్తి, చిన్నప్పయ్య, గుట్టూరు నాగరాజు, పోతి రెడ్డి, ఆదిశేషు, హుజూర్, జావిద్, మహ్మద్, రియాజ్, షౌకత, అత్తర్‌ఖాదిర్, అజ్మతుల్లా, ఫిరోజ్‌ఖాన, అమీర్‌ఖాన, సైఫుల్లాఖాన, చంద్ర కాంతమ్మ, రాము, వెంకటేశనాయక్, రవినాయక్, హనుమంతు నాయక్, క్రిష్టప్ప, సూరి, నియోజకవర్గానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఆలయంలో పూజలు
రొద్దం: వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్‌చేసి జైలుకు పంపిందని, న్యాయవ్యవస్థే బాబును కాపాడుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి ఆ శాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బెయిల్ ప్రసాదించాలంటూ గురువారం రొద్దంలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి 101కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా బీకే మాట్లాడుతూ... న్యాయవ్యవస్థపై అపారమైన గౌరవం, విశ్వాసం తమకుందన్నారు. కేవ లం సీఐడీతో అక్రమ కేసులు బనాయించి చంద్ర బాబును జైలులో ఉంచ డం దారుణమన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా ఉ పాధ్య క్షుడు హరీష్, మురళి, మాజీ సర్పంచ నారాయణప్ప, నాగప్ప, ఎం.కొత్త పల్లి సర్పంచ నాగరాజు, బేల్దార్ కిష్ట, మాజీ ఎంపీటీసీ చంద్ర శేఖర్, ఇమాంసాబ్, తులసి, ఉగ్గీరప్ప, రామచంద్ర పాల్గొన్నారు.
Updated Date - 2023-09-21T23:58:44+05:30 IST