ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశాభివృద్ధిని గాలికొదిలిన కేంద్రం

ABN, First Publish Date - 2023-02-06T23:54:26+05:30

కేంద్ర ప్రభుత్వం దేశాభివృద్ధిని గాలికొదిలేసిందని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతా్‌పరెడ్డి మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి

అనంతపురం న్యూటౌన, ఫిబ్రవరి 6: కేంద్ర ప్రభుత్వం దేశాభివృద్ధిని గాలికొదిలేసిందని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతా్‌పరెడ్డి మండిపడ్డారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం నుంచి సాయినగర్‌ స్టేట్‌బ్యాంక్‌ వరకు పార్టీ జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ముఖ్య అతిఽథిగా పార్టీ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు దాదాగాంధీ హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రతా్‌పరెడ్డి మాట్లాడుతూ హిండెనబర్గ్‌ నివేదికను ఆధారంగా తీసుకొని జాయింట్‌ పార్లమెంటరీ పార్టీ కమిటీ ఎంక్వైరీ వేయాలన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనంతో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. అందులో భాగంగా స్టేట్‌బ్యాంకు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రజా ప్రయోజనాల ను గాలికి వదిలేసి ఇద్దరు ప్రైవేట్‌ వ్యక్తులకు లాభం చేకూర్చేల కేంద్రం చర్యలు సరికాదని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని మైనార్టీ విభాగం అధ్యక్షుడు దాదాగాంధీ పేర్కొ న్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శంకర్‌, జిల్లా ఉపాధ్యక్షులు వాసు, బీసీ సెల్‌ అధ్యక్షులు రామ్‌చరణ్‌యాదవ్‌, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, రైతు సంఘం నాయకులు క్రిష్ణ, జిల్లా కార్యదర్శి అబ్బాస్‌, మైనార్టీ నాయకులు శర్మాస్‌, రాప్తాడు నాయకులు గోవిందు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:54:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising