పరీక్షలు.. పరుగులు
ABN, First Publish Date - 2023-03-16T00:41:43+05:30
ఇంటర్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా సాగాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 99 కేంద్రాల్లో బుధవారం పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు కావడంతో కొందరు విద్యార్థులు ఆలస్యంగా కేంద్రాలకు చేరుకోవడంతో ఉరుకులు పరుగులు తప్పలేదు. తల్లిదండ్రులు, బంధువుల ఆధ్వర్యంలో చాలా మంది విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.
ఇంటర్ పరీక్షలు ప్రారంభం..
ఉమ్మడి జిల్లాలో 99 కేంద్రాల్లో నిర్వహణ..
779 మంది గైర్హాజరు
అనంతపురం విద్య, మార్చి 15: ఇంటర్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా సాగాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 99 కేంద్రాల్లో బుధవారం పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు కావడంతో కొందరు విద్యార్థులు ఆలస్యంగా కేంద్రాలకు చేరుకోవడంతో ఉరుకులు పరుగులు తప్పలేదు. తల్లిదండ్రులు, బంధువుల ఆధ్వర్యంలో చాలా మంది విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. చాలా మంది విద్యార్థులు ఉదయం 7.30 గంటలకే కేంద్రాల వద్దకు వచ్చారు. పరీక్షా కేంద్రాల్లోకి 8.30 గంటల తర్వాత అనుమతించారు. అయితే చాలా కేంద్రాల వద్ద విద్యార్థులకు కేటాయించిన గదులను తెలియజేసే హాల్‌టికెట్ల పట్టికను చాలా తక్కువ చోట్ల ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలో 99 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా.. జనరల్ విద్యార్థులు 26,777 మందికి గాను 26,127 మంది హాజరయ్యారు. 650 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 2,549 మందికిగాను 2,420 మంది విద్యార్థులు హాజరు కాగా 129 మంది గైర్హాజరయ్యారు. కొన్ని కేంద్రాల్లో చీకటి గదుల్లోనే పరీక్షలు నిర్వహించారు. అనంతపురం నగరంలోని న్యూటౌన జూనియర్ కళాశాలలలో ఉన్న ఒకేషనల్ జూనియర్ కళాశాలలో కొన్ని గదులు చీకటిగా ఉన్నాయి. లైట్లు ఏర్పాటు చేసినా చీకట్లు మాత్రం వీడలేదు.
Updated Date - 2023-03-16T00:41:43+05:30 IST