పాత నేరస్థులపై నిఘా: జీఆర్పీ ఎస్పీ
ABN, First Publish Date - 2023-09-21T23:42:46+05:30
రైళ్లల్లో నేరాలకు పాల్పడ్డ రికార్డు ఉన్నవారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని జీఆర్పీ ఎస్పీ చౌడేశ్వరి సూచించారు.
గుంతకల్లు, సెప్టెం బరు 21: రైళ్లల్లో నేరాలకు పాల్పడ్డ రికార్డు ఉన్నవారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని జీఆర్పీ ఎస్పీ చౌడేశ్వరి సూచించారు. గురువారం ఉదయం స్థానిక రాష్ట్ర ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్పీ) ఎస్పీ కార్యాలయంలో క్రైం మీటింగ్‌ను నిర్వహించారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో ఎస్పీ మాట్లాడుతూ నేరాల అదుపునకు పాత నేరస్థులపై ఓ కన్నువేసి ఉంచాలన్నారు. పెండింగులో ఉన్న సమన్లను సమీక్షించారు. రెండోదఫా రైళ్లలో నేరాలకు పాల్పడ్డవారిపై క్రైం హిస్టరీ షీట్‌ను తెరవాలన్నారు. గంజాయి తరలింపు, రైల్వే పరిసరాల్లో గంజాయి వినియోగాలపై దృష్టిని సారించాలన్నారు. గంజాయి కేసుల్లో నిందింతులుగా ఉండి పరారైనవారిని పట్టుకోవాలని ఆదేశించారు. సివిల్ పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులతో సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. డీఎ్‌సఆర్పీలు అజీజ్, షేక్షా, మల్లికార్జున రావు, ఏఓ శ్రీనివాసరావు, జీఆర్పీ సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-21T23:42:46+05:30 IST