ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాష్ట్రం జగనరెడ్డి జాగీరా..?

ABN, First Publish Date - 2023-09-20T00:02:04+05:30

రాష్ట్రం ఏమైనా సీఎం జగనరెడ్డి జాగీరా అంటూ మాజీ మంత్రి పరిటాలసునీత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ సీఎం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కదిరిలో కందికుంట వెంకట ప్రసాద్‌ చేపట్టిన పాదయాత్రకు ఆమె స్వగ్రమం వెంకటాపురం నుంచి ధర్మవరం మీదుగా వెళుతుండగా.. విషయం తెలిసి పోలీసులు లక్ష్మీచెన్నకేశవపురంలో అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

ఫ మాజీ మంత్రి

పరిటాల సునీత ఆగ్రహం

ఫ కదిరికి వెళ్లనివ్వకుండా ధర్మవరంలో

అడ్డుకున్న పోలీసులు

ఫ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన సునీత, టీడీపీ శ్రేణులు

ధర్మవరం, సెప్టెంబరు 19: రాష్ట్రం ఏమైనా సీఎం జగనరెడ్డి జాగీరా అంటూ మాజీ మంత్రి పరిటాలసునీత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ సీఎం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కదిరిలో కందికుంట వెంకట ప్రసాద్‌ చేపట్టిన పాదయాత్రకు ఆమె స్వగ్రమం వెంకటాపురం నుంచి ధర్మవరం మీదుగా వెళుతుండగా.. విషయం తెలిసి పోలీసులు లక్ష్మీచెన్నకేశవపురంలో అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కదిరికి వెళ్లడానికి అనుమతులు లేవని నిలిపివేశారు. దీంతో పరిటాల సునీత పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఆమెను బలవంతంగా వాహనంలో ఎక్కించి స్థానికంగా టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షా శిబిరం వద్దకు తీసుకొచ్చారు. దీంతో దీక్ష చేపడుతున్న 40 వార్డుల టీడీపీ ఇనచార్జిలు, టీడీపీ శ్రేణులతో కలిసి పరిటాలసునీత రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న జనసేన రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మఽధుసూదనరెడ్డి మద్దతు తెలియజేశారు. ఈసందర్భంగా పరిటాలసునీత, చిలకం మధుసదూనరెడ్డిలు టీడీపీ శ్రేణులతో కలిసి శిబిరం వద్ద నుంచి ర్యాలీగా ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు చేరుకుని అక్కడ ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ంద్రబాబుకు బెయిల్‌ మంజూరు కావాలని, జగన ప్రభుత్వానికి ఇప్పటికైనా బుద్దిరావాలంటూ పూజలు చేయించారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ.. అసలు మనం ఏ రాజ్యాంలో ఉన్నామో అర్థంకాలేదన్నారు. ప్రతిపక్షాలు రోడ్డు ఎక్కగానే అరెస్టులు చేయమని సీఎం జగన చెప్పారా అంటూ పోలీసులను ప్రశ్నించారు. ఈ రాష్ట్రం ఏమైనా ఆయన జాగీరా అంటూ మండిపడ్డారు. జగన ఎన్నికుట్రలు చేసిన చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆమె పేర్కొన్నారు. అనంతరం చిలకం మాట్లాడుతూ... రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని, ఇది ఎంతో కాలం సాగదని, త్వరలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలే గద్దె దించుతారని పేర్కొన్నారు.

Updated Date - 2023-09-20T00:02:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising