టీడీపీ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి
ABN, First Publish Date - 2023-06-26T01:00:45+05:30
తెలుగుదేశం పాలనతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, మాటకు కట్టుబడి శెట్టిపల్లివద్ద బ్రిడ్జి నిర్మించి అభివృద్ధి చేసి చూపించామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పేర్కొన్నారు.
పెనుకొండ రూరల్, జూన 25 : తెలుగుదేశం పాలనతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, మాటకు కట్టుబడి శెట్టిపల్లివద్ద బ్రిడ్జి నిర్మించి అభివృద్ధి చేసి చూపించామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పేర్కొన్నారు. టీడీపీ ప్రారంభించిన భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథం బస్సుయాత్ర జనం బ్రహ్మరథం పట్టారు. తెలుగుతమ్ముళ్లలో ఉత్సాహం ఉరకలెత్తింది. పార్టీ జెండాలు పట్టి, నినాదాలతో మార్మోగించారు. పెనుకొం డ నియోజకవర్గంలోని శెట్టిపల్లి క్రాస్ నుంచి బస్సుయాత్ర ఆదివారం ప్రా రంభమైంది. నాయకులు, కార్యకర్తలకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. టీడీపీ హయాంలో శెట్టిపల్లిలో రూ. 7.13కోట్లతో నిర్మించిన వంతెనపై అ నంతపురం ఉమ్మడి జిల్లాల నాయకులు బీకే పార్థసారథి, పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు, బీటీ నాయుడు, సవిత తదితరులు బ్రిడ్జివద్ద సెల్ఫీ చాలెంజ్ చేశారు. అనంతరం బీకే మాట్లాడుతూ శెట్టిపల్లి చుట్టుపక్కల 16 గ్రామాల ప్రజలు వర్షా కాలం వచ్చిందంటే శెట్టిపల్లి వంకలో రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు. దీంతో 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలెక్షనల సమయంలో వారు గ్రా మానికి వచ్చినప్పుడు బ్రిడ్జి నిర్మించాలని అడ్డుకున్నామని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే మూడు నెలల్లో బ్రిడ్జి నిర్మిస్తామని అప్పుడు ఇచ్చిన మాటకు కట్టుబడి యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేసి, మీ గ్రామానికి వచ్చామన్నారు. అభివృద్ధి చేసేవారికి సహకరించాలని ప్రజలను కోరారు. చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను వివరించారు. అనం తరం శెట్టిపల్లిలో అంబేడ్కర్, వాల్మీకి విగ్రహాలకు పూలమాలలువేసి నివా ళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నిమ్మలకిష్టప్ప, సవిత, అంబికా లక్ష్మీనారాయణ, వెంకటశివుడు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-26T01:00:45+05:30 IST