పనులు పూర్తయినా నేమ్ బోర్డులు ఏర్పాటు చేయరా ?
ABN, First Publish Date - 2023-02-24T00:06:29+05:30
పనులు పూర్తి అయిన నేమ్ బోర్డులు ఏర్పాటు చేయరా అంటూ మండల ఉపాధి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉపాధి సిబ్బందికి అధికారుల మందలింపు
అనంతపురంరూరల్, ఫిబ్రవరి23: పనులు పూర్తి అయిన నేమ్ బోర్డులు ఏర్పాటు చేయరా అంటూ మండల ఉపాధి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం టీటీడీసీలో ఉపాధి పథకంపై సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. డీవీఓ రమణారెడ్డి, పీఓ సుధాకర్‌రెడ్డి, ఏపీడీ అనురాధ హాజరయ్యారు. మండలంలోని 25పంచాయతీల్లో వివిధ రకాల అభివృద్ధి పనుల కోసం రూ.6 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో ఎనఆర్‌ఈజీఎ్‌స, ఆర్‌డబ్ల్యూఎస్, హార్చికల్చర్ తదితర పనులకు నిధులు ఖర్చు చేశారు. ఈ పనుల్లో అవినీతి , అక్రమాలు వెలికి తీసేందుకు ప్రత్యేక సామాజికి తనిఖీ చేపట్టారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేక బృందం సభ్యులు మండలానికి వచ్చి పంచాయతీలు, గ్రామాల్లో పర్యటించారు. గ్రామసభలు నిర్వహించారు. అనంతరం గురువారం సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. ఇందులో అధికారులు గ్రామాల్లో జరిగిన పనులపై ఆరా తీశారు. కొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తి అయిన నేమ్ బోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై ఉపాధి సిబ్బందిని అధికారులు మందలించారు. పనులు ప్రారంభమైన వారం రోజుల్లోనే నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బాబాఫకృద్దీన, ఏపీఓలు చంద్రకళ, ఎర్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-24T00:06:30+05:30 IST