ముగిసిన శివరాత్రి బ్రహ్మోత్సవాలు
ABN, First Publish Date - 2023-02-21T23:15:53+05:30
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దుర్గావీరభద్రస్వామి ఆలయంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి.
విశేష పూజలందుకున్న ఆదిదంపతులు
లేపాక్షి, ఫిబ్రవరి 21: స్థానికంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దుర్గావీరభద్రస్వామి ఆలయంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు స్వామిఅమ్మవా ర్లకు అభిషేకార్చనలు, వసంతోత్సవం, ధ్వజావరోహణం పూజలను వేద పండితులు వైభవంగా నిర్వహించారు. వేడుకలను తిలకించడానికి భక్తు లు తరలివచ్చారు. దుర్గావీరభద్రస్వాములను ప్రత్యేకంగా అలంకరించి ప్ర త్యేక పూజలు చేశారు. ఉత్సవాలను ప్రశాంతంగా ముగియడంతో దేవదాయశాఖ సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూపురం రూరల్ సీఐ వేణుగోపాల్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
Updated Date - 2023-02-21T23:15:57+05:30 IST