ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యాలయాల్లో సంక్రాంతి సంబరాలు

ABN, First Publish Date - 2023-01-08T00:11:33+05:30

సంక్రాంతి గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, హరిదాసులు వంటివి తెలుగుజాతికి చిహ్నాలని అనంతలక్ష్మి విద్యాసంస్థల చైర్మన అనంతరాముడు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం సెంట్రల్‌, జనవరి 7: సంక్రాంతి గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, హరిదాసులు వంటివి తెలుగుజాతికి చిహ్నాలని అనంతలక్ష్మి విద్యాసంస్థల చైర్మన అనంతరాముడు పేర్కొన్నారు. శనివారం అనంతలక్ష్మి ఇంటర్నేషనల్‌ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన అనంతరాముడు దంపతులు, వైస్‌చైర్మన రమేష్‌ నాయుడు దంపతులు జ్యోతిప్రజ్వలనతో సంబరాలను ప్రారంభించారు. అనంతరం చిన్నారుల సంప్రదాయ వేషధారణలు, గాలిపటాల ఎగురవేత, గొబ్బెమ్మల ముగ్గులు తదితర కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో సీఏఓ నరసింహారావు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నలిని పాల్గొన్నారు.

పీవీకేకేలో ...

అనంతపురంరూరల్‌ : స్థానిక పీవీకేకే ఇంజనీరింగ్‌ కళాశాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. వారు తీర్చిదిద్దిన ముగ్గులు వీక్షకులను ఆకట్టుకున్నాయి. కళాశాల చైర్మన మాట్లాడుతూ భారతీయ ప్రాచీన సంప్రదాయాలను గౌరవించాలని, దేశ సంస్కృతికి అనుగుణంగా నడుచుకోవాలనే ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల కోశాధికారి పల్లె సింధూర, కళాశాల ప్రిన్సిపాల్‌ బండి రమే్‌షబాబు, వైస్‌ ప్రిన్సిపాల్‌ రాఘవేంద్ర, ప్రసాద్‌, ఏఓ మనోహర్‌రెడ్డి, ఎంబీఏ, అధ్యాపకులు దీపిక తదితరులు పాల్గొన్నారు.

శ్రీచైతన్యలో ...

మండలంలోని పామురాయి శ్రీచైతన్య స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు సంప్రదాయ వసా్త్రలు ధరించి గాలిపటాలు ఎగురవేస్తూ, హరిదాసు వేశధారణలో అలరించారు. కార్యక్రమానికి ఏజీఎం సుబ్బారెడ్డి, సమీనా ఖాన హాజరయ్యారు. ఈసందర్భంగా బోగి మంటలు వేశారు. ముత్యాల ముగ్గులు వేసి, పిల్లలకు భోగి పళ్లు పోశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ స్వరూప, వైస్‌ ప్రిన్సిపాల్‌ కరిముల్లా రాయుడు, ఓబిరెడ్డి ధరియవలి, ప్రైమరీ ఇనచార్జ్‌ వంశీ ప్రియ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-08T00:14:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising