భక్తిశ్రద్ధలతో గంధం ఊరేగింపు
ABN, First Publish Date - 2023-09-27T23:45:12+05:30
మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలో ఘనంగా గంధం ఊరేగిం చారు
అనంతపురం కల్చరల్, సెప్టెంబరు 27: మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలో ఘనంగా గంధం ఊరేగిం చారు. గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన గౌస్‌మోద్దీన్ బుధవారం సా యంత్రం సాయినగర్‌లో తన నివాసం నుంచి ముస్లింలతో కలిసి సూర్యనగర్ 80 అడుగుల రోడ్డు, పాతూరులో ఊరేగింపు నిర్వహిం చారు. అనంతరం పామిడికి వెళ్లి దర్గాలో గంధం సమర్పించారు. మ ధ్యాహ్నం తన నివాసం వద్ద దాదాపు మూడు వేల మందికి అన్న దా నం చేశారు. కార్యక్రమంలో గాండ్ల ఫెడరేషన సాధికారిక కమిటీ ఛైర్ పర్సన, విశాలక్ష్మి, సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సీపీఎం నాయకు డు వలి, టీడీపీ నాయకులు తాజుద్దీన, లింగారెడ్డి, స్వప్న, ఐఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్‌బాషా, తెలుగు యువత అధ్యక్షుడు బొమ్మినేని శివ, టీఎనటీయూసీ అధ్యక్షుడు ధన, రమేష్, జనసేన రాష్ట్ర కార్యదర్శి భవాని రవికుమార్, ఎనబీకే ఫ్యాన్స, ముస్లీం మతపెద్దలు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-27T23:45:12+05:30 IST