ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంధం వేడుకలు

ABN, First Publish Date - 2023-01-05T23:47:16+05:30

హిందూ, ముస్లింలు ఐక్యమత్యంగా జరుపుకునే పెనుకొండ బాబయ్యస్వామి గం ధం వేడుకలు గురువారంతో ఘనంగా ముగిశాయి.

బాబయ్య సమాధివద్ద పూజలు నిర్వహిస్తున్న పీఠాధిపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుకొండ, జనవరి 5: హిందూ, ముస్లింలు ఐక్యమత్యంగా జరుపుకునే పెనుకొండ బాబయ్యస్వామి గం ధం వేడుకలు గురువారంతో ఘనంగా ముగిశాయి. ఉరుసు మహోత్సవంలో భాగంగా గురువారం తెల్లవారుజామున 3 గంటలకు దర్గా పీఠాధిపతి తాజ్‌బాబా స్వగృహం నుంచి గంధాన్ని మేళతాళాలతో డప్పులు వాయిస్తూ ఫక్కీర్ల విన్యాసాలతో మతపెద్దలు వెంటరాగా తాజ్‌బాబా కుమారుడు సలావుద్దీనబాబా దర్గాలోని బాబయ్య సమాధి వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి సమాధివద్ద గంధం చదివించి ప్రార్థనలు నిర్వహించారు. ఈ గంధంపూజ మహోత్సవాన్ని తిలకించడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. వేడుకల ఏర్పాట్లను డీఎస్పీ హుసేనపీరా, సీఐ కరుణాకర్‌, ఎస్‌ఐ రమే్‌షబాబులు పర్యవేక్షించారు. రాత్రి సమయంలో ఖవాలి, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

సర్వమత సమ్మేళనం

బాబయ్య ఉరుసు వేడుకల్లో భాగంగా స్థానిక ఖవాలీ మందిరం వద్ద మత సామరస్యానికి ప్రతీకగా సర్వమత సమ్మేళనం నిర్వహించారు. దర్గా పీఠాధిపతి తాజ్‌బాబా ఆధ్వర్యంలో ముస్లిం నగారా అధ్యక్షుడు ఉమర్‌ఫరూక్‌, శ్రీసత్యసాయి రచయితల సంఘం అధ్యక్షుడు జాబిలి చాంద్‌బాష, సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనంలో శివసాయిబాబా, క్రిస్టియన మిషన చైర్మన చల్లగాని ప్రభాకర్‌, పీఠాధిపతులు, మత పెద్దలు హాజరయ్యారు. మత సామరస్యానికి కృషిచేసిన 50మంది సామాజిక సేవకులకు దర్గా నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ అవార్డులను ప్రదానం చేశారు.

డీపీఓ కార్యాలయం రుద్రంపేటకు మార్పు

అనంతపురం న్యూటౌన, జనవరి 5: జిల్లా పంచాయతీ కార్యాల యాన్ని రుద్రంపేటలోని పాతభవనంలోకి మార్చినట్లు డీపీఓ ప్రభాకర్‌రావు తెలిపారు. శుక్రవారం నుంచి మొత్తం సిబ్బంది అక్కడ నుంచే విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. రుద్రంపేటలోని సొంత భవనం మరమ్మతులకు గురవడంతో జడీప ఆవరణలోని జిల్లా పంచాయతీ వనరుల కేంద్రంలోకి తాత్కాలికంగా గతంలోకి మార్చిన విషయం తెలిసిందే. మరమ్మతులు పూర్తవడంతో తిరిగి సొంత భవనంలోకి రానున్నారు. గురువారం డీపీఓ ప్రభాకర్‌రావు, డీఎల్‌పీఓ సుమన జయంతి, ఏఓ సోముశేఖర్‌, ఇతర సిబ్బంది కార్యాలయాన్ని పరిశీలించారు.

Updated Date - 2023-01-05T23:47:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising