విప్ కాపు ఆధ్వర్యంలో ఇసుక దందా
ABN, First Publish Date - 2023-03-31T00:22:47+05:30
ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి నాయకత్వంలో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఇసుకను అక్ర మంగా కర్ణాటకకు తరలిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు.
- మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు
రాయదుర్గం, మార్చి 30: ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి నాయకత్వంలో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఇసుకను అక్ర మంగా కర్ణాటకకు తరలిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. ఆయన గురువారం ప్రకటన విడుదల చేశారు. డి హీరేహాళ్ మండలం నుంచి ఇసుకను బళ్లారికి తరలిస్తున్న టిప్పర్‌ను కర్ణాటక రూరల్ పోలీసులు పట్టుకున్నారన్నారు. పట్టుబడిన టిప్పర్ డ్రైవర్ సిద్ధాఽపురం తండాకు చెందిన వ్యక్తిగా బళ్లారి పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. నాడు-నేడు పనుల ముసుగులో ఇసుకను టిప్పర్ల ద్వారా బ ళ్లారి, బెంగుళూరు నగరాలకు తరలిస్తూ కాపు రామచంద్రారెడ్డి కోట్ల రూపాయలు కొల్లడొడుతున్నాడని విమర్శిం చారు. ఇసుక, మద్యం స్మగ్లింగ్‌లో ఆరితేరిన ఎమ్మెల్యే తన అక్ర మాలకు రాయదుర్గాన్ని అడ్డాగా మార్చుకున్నాడన్నారు. తిమ్మలా పురం, కాద లూరు తదితర ప్రాంతాల నుండి మార్కెట్‌యార్డు చైర్మన భోజరాజనా యక్ మరికొందరు వైసీపీ నాయకులు ప్రతి రోజూ ఇసుకను కర్ణాటక రాషా్ట్రనికి తరలిస్తున్న వాస్తవాన్ని తనతోపాటు ఆయా గ్రామాల ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళుతున్నా చర్యలు తీసుకో వడం లేదన్నారు. తాను కాపు అక్రమాలను ప్రశ్నించిన ప్రతిసారి అతని అక్రమ లావా దేవీల్లో భాగస్వామిగా ఉన్న భోజరాజనాయక్ పేరి ట ఎమ్మెల్యే తప్పుడు ప్రకటనలు ఇప్పిస్తుంటాడన్నారు. వారు తనపై ఎంత గా దిగజారి తప్పుడు ప్రచారం చేయించినా కాపు అవినీతిని ఎండ గడుతూనే ఉం టానన్నారు. ఇసుక తరలింపుపై తిమ్మలాపురం గ్రామ స్థులు ఏకంగా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు మొరపెట్టుకున్నా, కాపు ఇసుక దందాకు కళ్లెం పడలేన్నారు. బొమ్మనహాళ్, డీ.హీరేహాళ్ మండ లాల నుండి బళ్లారికి తరలి వెళుతున్న ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్లను అప్పుడప్పు డు పట్టుకుం టున్నారన్నారు. ఇప్ప టికైనా పోలీసులు వైసీపీ నాయకుల అక్రమ ఇసుక, మద్యం వ్యాపారాలను అరికట్టడానికి శ్రద్ధ చూపాలని కాలవ డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము స్వయంగా సందర్శించి కాపు అక్రమ భాగోతాలను ప్రజలకు తెలియజేస్తామని హెచ్చరించారు.
Updated Date - 2023-03-31T00:22:47+05:30 IST