ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాతృభాషతోనే సంస్కృతి, సంప్రదాయాల సంరక్షణ

ABN, First Publish Date - 2023-02-21T23:37:33+05:30

సంస్కృతి, సంప్రదాయాల సంరక్షణ మాతృ భాషతోనే సాధ్యమని కేహెచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ జీవనకుమార్‌ పేర్కన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మవరం, ఫిబ్రవరి 21: సంస్కృతి, సంప్రదాయాల సంరక్షణ మాతృ భాషతోనే సాధ్యమని కేహెచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ జీవనకుమార్‌ పేర్కన్నారు. కళాశాలలో మంగళవారం అంతర్జాతీయ మాతృబాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా వైస్‌ ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ... మాతృబాష మన జీవన విధానానికి మూలాధారం అన్నారు. మాతృ భాషను కాపాడుకుంటూ తక్కిన భాషల్ని నేర్చుకోవడం ద్వారా శాస్ర్తీయ దృక్పథం పెంపొందుతుందన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రాబియాబేగం, చిట్టెమ్మ, షమీవుల్లా, పావని, గోపాల్‌నాయక్‌, కిరణ్‌కుమార్‌,భువనేశ్వరి, పుష్పావతి, గౌతమి, రామ్మోహనరెడ్డి పాల్గొన్నారు.

ధర్మవరంరూరల్‌: మండలం లోని పోతులనాగేపల్లి ప్రాథమి కోన్నత పాఠశాలలో మంగళవారం అంతర్జాతీయ మాతృభాష దినోత్స వాన్ని, శ్రీరామకృష్ణ పరమహంస జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా పాఠశాల ఇనచార్జ్‌ ప్రధానోపాధ్యా యులు అన్నం అరవింద్‌ మాట్లాడుతూ మాతృభాష అమ్మవంటిదని, మాతృ భాషలో పట్టుసాధిస్తే మిగిలిన భాష సులభతరమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్‌, చలపతి, జయప్రద తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T23:37:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising