వేరుశనగ వామికి నిప్పు
ABN, First Publish Date - 2023-03-05T00:52:02+05:30
మండల పరిధిలోని మద్దలచెరువు గ్రామంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వేరుశనగ కాయలతో ఉన్న వామికి నిప్పు పెట్టారు. దీంతో సుమారు 10 ట్రాక్టర్లు వేరుశనగ కట్టె, కాయులు కాలి బూడిదయ్యాయి.
రైతుకు రూ.5 లక్షల నష్టం
ధర్మవరం రూరల్, (కనగానపల్లి), మార్చి 4: మండల పరిధిలోని మద్దలచెరువు గ్రామంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వేరుశనగ కాయలతో ఉన్న వామికి నిప్పు పెట్టారు. దీంతో సుమారు 10 ట్రాక్టర్లు వేరుశనగ కట్టె, కాయులు కాలి బూడిదయ్యాయి. రూ.5 లక్షలకు పైగా నష్టం జరిగిందని బాధిత రైతు మల్లాల రామాంజినేయులు కంటతడి పెట్టాడు. రబీలో సాగుచేసిన వేరుశనగ పంటను నాలుగు రోజుల క్రితం తొలగించి, పొలం దగ్గరే వామి వేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి అక్కడికి వెళ్లి నిప్పు పెట్టారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. చుట్టుపక్కల రైతులు వెళ్లి మంటలు అర్పే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. బాధిత రైతు కనగానపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Updated Date - 2023-03-05T00:52:02+05:30 IST