ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇష్టపడి చదవాలి

ABN, First Publish Date - 2023-03-26T00:07:45+05:30

విద్యార్థులు కష్టంగా ఇష్టపడి చదివినపుడే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని హైకోర్టు జడ్జి జస్టిస్‌ రమేష్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- హైకోర్టు జడ్జి జస్టిస్‌ రమేష్‌

రాయదుర్గంరూరల్‌, మార్చి 25 : విద్యార్థులు కష్టంగా ఇష్టపడి చదివినపుడే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని హైకోర్టు జడ్జి జస్టిస్‌ రమేష్‌ పేర్కొన్నారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్ర మాన్ని హెచఎం వెంకటేష్‌బాబు ఆధ్వ ర్యంలో నిర్వహించారు. పూర్వవిద్యార్థులు తమకు చదువు చెప్పిన గురు వులు చెన్నకేశవమూర్తి, హీరోజీరావులను శాలువ, పూలమాలతో ఘనం గా సత్కరించారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి రమేష్‌ మాట్లాడు తూ చదువులు మారినా పాఠశాల మారకపోవడం ఆనందదాయకమ న్నారు. ఆనాడు పాఠశాలలో గురువులు చెప్పిన పాఠాలను స్మరించు కుంటూ స్నేహితులతో ఆడిన ఆటలు గుర్తు చేసుకున్నారు. ఈ పాఠశా లలో విద్యాభ్యాసం చేసి 45 సంవత్సరాల తరువాత ఇదే ప్రాంతానికి రావడం పూర్వవిద్యార్థులతో కలిసి మాట్లాడటం ఆనందదాయక మన్నారు. విద్యార్థులు అధైర్యపడకుండా ప్రభుత్వ పాఠశాలలో విద్యన భ్యసించి ఉన్నతస్థాయికి ఎదిగి తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పూర్వవిద్యార్థులు, స్నేహితులు పాఠశా లలో 1977 నుంచి 1980 వరకు పాఠశాలలో విద్యాభ్యాసం చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించిన జస్టిస్‌ రమేష్‌ను పూలమాల, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్జి లావణ్య, డీఈఓ సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:07:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising