ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చుక్కల భూములతో తప్పని చిక్కులు

ABN, First Publish Date - 2023-06-26T00:50:49+05:30

భూములు ఉన్న రైతులు ఎంతో మనో ధైర్యంగా ఉంటారు. అయితే చుక్కల భూములు ఉన్న రైతులు పరిస్థితి అందుకు విరుద్ధం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మడకశిర రూరల్‌, జూన 25 : భూములు ఉన్న రైతులు ఎంతో మనో ధైర్యంగా ఉంటారు. అయితే చుక్కల భూములు ఉన్న రైతులు పరిస్థితి అందుకు విరుద్ధం. తమ కు భూములు ఉన్నాయనే మాట తప్ప కష్ట కాలంలో ఆదుకోవడానికి ఎందుకూ పనికి రావని ఆ రైతులు నిరంతరం ఆవేదన చెందుతున్నారు. చుక్కుల భూములను అమ్ము కోవడానికి రిజిసే్ట్రన చేయరు. దీంతో బ్యాంకుల్లో రుణాలివ్వరు. ఎవరూ తనఖా పెట్టు కోరు. దానం ఇచ్చేందుకు చెల్లుబాటు కావు. వారసత్వపు ఆస్తులుగా చెప్పుకోవడానికి వీ లులేని భూములు. మండలంలోని చందకచర్ల పంచాయతీ గ్రామాల్లో 60 మంది రైతులకు 236. 55 ఎకరాల చుక్కల భూములున్నాయి. వారు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం పొందలేకపోతున్నారు. దాదాపు వంద సంవత్సరాల క్రితం భూములు రీ సర్వే జరిగినప్పుడు అవి ప్రభుత్వ భూములా, ప్రవేట్‌ భూములా అని నిర్ధారణ చేయ ని కారణంగా రెవెన్యూ రికార్డులలో పట్టాదారుడి గడిలో చుక్కలు పెట్టివదిలేశారు. ద శాబ్దాలుగా ఆ భూములు రైతుల అనుభవంలో ఉన్నా వాటిని అమ్ముకునే హక్కులు మాత్రం ఆ రైతులకు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం 2023 మేలో వాటిని చు క్కల భూముల స్టేటస్‌ నుంచి తొలగించి పట్టా భూములుగా మార్పుచేస్తూ 22ఏ(1) (ఈ) నుంచి డీ నోటిఫికేషన చేసింది. చుక్కల భూములు ఉన్న రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే నేటికీ తహసీల్దార్‌, సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాలకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదు. దీంతో చుక్కల భూములు ఉన్న రైతులు రోజు రెండు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వెంటనే చుక్కల భూముల మార్పుపై ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

కలెక్టర్‌ ఆధ్వర్యంలోనే మార్పు - బాలాంజనేయులు, డీప్యూటీ తహసీల్దార్‌, మడకశిర

మండలంలో ఉన్న చుక్కల భూముల వివరాలు కలెక్టర్‌కు నివేదిక ఇస్తాం. ఆయన పరిశీలించి చుక్కల భూముల స్టేటస్‌ నుంచి తొలగించి పట్టా భూములుగా మారుస్తారు. ఈ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది.

కలెక్టర్‌ ఆదేశాలిచ్చిన భూములకే రిజిషే్ట్రషన

- భాగ్యలక్ష్మమ్మ, ఇనచార్జ్‌ సబ్‌ రిజిసా్ట్రర్‌, మడకశిర

చుక్కల భూముల స్టేటస్‌ నుంచి తొలగించి పట్టాభూములగా కలెక్టర్‌ ఆధ్వర్యంలో మారుస్తారు. ఆ భూములను స్థానిక తహసీల్దార్‌ పరిశీలించి మాకు నివేదిక పంపుతారు. ఆ నివేదికలో ఉన్న భూములను మాత్రమే రిజిస్ట్రేషన చేస్తాం.

Updated Date - 2023-06-26T00:50:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising