వైభవంగా మద్దానేశ్వరస్వామి రథోత్సవం
ABN, First Publish Date - 2023-02-21T23:33:23+05:30
మండలంలోని 74 ఉడేగోళం గ్రామ సమీపంలో వెలసిన ఉద్బవమూర్తి మద్దానేశ్వరస్వామి రథోత్సవం జనసందోహం మధ్య వైభవంగా సాగింది.
రాయదుర్గంరూరల్, ఫిబ్రవరి 21: మండలంలోని 74 ఉడేగోళం గ్రామ సమీపంలో వెలసిన ఉద్బవమూర్తి మద్దానేశ్వరస్వామి రథోత్సవం జనసందోహం మధ్య వైభవంగా సాగింది. ఉదయాన్నే అర్చకులు పూజలు నిర్వహించారు. సా యంత్రం 4.30 గంటలకు స్వామి వారి ప్రతిమను రథంలో ప్రతిష్టించి బ్రహ్మ రథాన్ని ఊరేగించారు. దేవాలయం వద్ద నుండి పాదగట్ట వరకు రథాన్ని లాగా రు. పశువుల జాతర పురస్కరించుకొని దేవాలయం వద్ద గాజుల దుకాణాలు, బొమ్మల దుకా ణాలు విరివిగా వెలిశాయి. రాయదుర్గం, ఉడేగోళం, రాయంపల్లి, ఆయతపల్లి, బొమ్మక్కపల్లి, కర్ణాటకలోని చెళ్లకెర, చిత్రదుర్గం తదితర ప్రాంతాల నుంచి పెద్ద భక్తులు పాల్గొని స్వామి వారికి పూజలు నిర్వహించి రథోత్సవంలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనాయ సంఘటనలు జరుగకుండా సీఐ యుగం ధర్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు.
Updated Date - 2023-02-21T23:33:24+05:30 IST