కళ్యాణదుర్గం పట్టణ శివార్లలో చిరుతల సంచారం
ABN, First Publish Date - 2023-04-20T07:57:59+05:30
కళ్యాణదుర్గం పట్టణ శివార్లలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. వెంగమాంబ గోశాలలో రెండు చిరుత పులులు చొరబడిన ఘటన ఆందోళన కలిగిస్తోంది.
అనంతపురం : కళ్యాణదుర్గం పట్టణ శివార్లలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. వెంగమాంబ గోశాలలో రెండు చిరుత పులులు చొరబడిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. అర్ధరాత్రి గోవులను ఎత్తుకెళ్లడానికి చిరుతలు యత్నించాయి. అరుపులు, కేకలతో రెండు గంటలపాటు ఆవులపై దాడిని గోశాలలోని సంరక్షకులు అడ్డుకున్నారు. అదే సమయంలో కళ్యాణదుర్గం పట్టణ పోలీసులు అటుగా వచ్చారు. గో సంరక్షకులతో పాటు గోశాలకు రెండు గంటల పాటు పోలీసులు కాపలా ఉన్నారు.
Updated Date - 2023-04-20T07:57:59+05:30 IST