ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడవిలో లేడి పిల్లలా..

ABN, First Publish Date - 2023-06-07T00:28:16+05:30

అటవీ శాఖలో మహిళా ఉద్యోగులకు భద్రత కరువైంది. తోటి ఉద్యోగులే బ్లాక్‌మెయిల్‌ చేస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఓ మహిళా ఉద్యోగి మహిళా పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం అటవీశాఖ జిల్లా అధికారి దృష్టికి వెళ్ల డంతో శాఖ పరువు పోతుందని భావించి ఎలాంటి సమస్య తలెత్తకుండా నేను చూసుకుంటాను అని ఆ ఉద్యోగిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అటవీశాఖలో మహిళా ఉద్యోగికి భద్రత ఏదీ?

తన స్వార్థం కోసం తోటి ఉద్యోగి బ్లాక్‌మెయిలింగ్‌..

మహిళా పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదు..

శాఖ పరువు పోతుందని డీఎఫ్‌ఓ బుజ్జగింపు

అనంతపురం న్యూటౌన, జూన 6: అటవీ శాఖలో మహిళా ఉద్యోగులకు భద్రత కరువైంది. తోటి ఉద్యోగులే బ్లాక్‌మెయిల్‌ చేస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఓ మహిళా ఉద్యోగి మహిళా పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం అటవీశాఖ జిల్లా అధికారి దృష్టికి వెళ్ల డంతో శాఖ పరువు పోతుందని భావించి ఎలాంటి సమస్య తలెత్తకుండా నేను చూసుకుంటాను అని ఆ ఉద్యోగిని బుజ్జగించినట్లు తెలిసింది. అనంతపురం రేంజ్‌ కార్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిపై పని చేసే ఓ కంప్యూటర్‌ ఆపరేటర్‌పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఇవి డీఎ్‌ఫఓ దృష్టికి కూడా వెళ్లాయి. దీంతో ఆయన రేంజర్‌ను పిలిపించి వెంటనే మరో కంప్యూటర్‌ ఆపరేటర్‌ను చూసుకొని ప్రస్తుతం ఉన్న ఆయన్ను ఇక్కడ లేకుండా చూడాలని గట్టిగా మందలించినట్లు తెలిసింది. కంప్యూటర్‌ ఆపరేటర్‌ను కాపాడే ప్రయత్నాల్లో భాగంగా ఆయన్ను గుత్తికి పంపడానికి నిర్ణయించుకున్నారు. అక్కడ ఉన్న మహిళా కంప్యూటర్‌ ఆపరేటర్‌ను అనంతపురం రేంజ్‌కు బదిలీ చేయాలనుకున్నారు. అయితే అనంత రేంజ్‌లో జరిగిన అక్రమాలు, రికార్డుల్లో తప్పిదాలను తెలుసుకున్న ఆమె గుత్తి నుంచి రావడానికి విముఖత చూపినట్లు సమాచారం. అయితే అనంతపురం రేంజ్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌కు స్థానం కల్పించడానికి అవకాశం లేకపోవడంతో గుత్తి నుంచి మహిళా కంప్యూటర్‌ ఆపరేటర్‌ను ఎలాగైనా ఖాళీ చేయించాలని పన్నాగం పన్నారు. అందులో భాగంగా సోమవారం అనంతపురం రేంజర్‌ శ్రీనివాసులు (గుత్తికి కూడా ఈయనే ఇనచార్జ్‌. ప్రస్తుతం కొత్త రేంజర్‌ను నియమించారు. ఆయన బాధ్యతలు చేపట్టేలోపే పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో భాగంగా) అనంతపురం కంప్యూటర్‌ ఆపరేటర్‌ను వెంట బెట్టుకొని గుత్తికి వెళ్లినట్లు తెలిసింది. మహిళా కంప్యూటర్‌ ఆపరేటర్‌ అందుబాటులో లేకపోయినప్పటికి ఫోనలో తీవ్రంగా బెదిరిస్తూ ఒత్తిడి చేసినట్లు తెలిసింది. దీంతో జరిగిన పరిణామాలపై కుటుంబ సభ్యులతో కలిసి ఆమె మహిళా పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇది జిల్లా అధికారి దృష్టికి వెళ్లడంతో ఆయన సమస్యను నేను పరిష్కరిస్తాను. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. మరి హామీని ఎంతవరకు నిలుపుకుంటారు. ఎంతవరకు న్యాయం చేస్తారు? అనంతపురం రేంజ్‌ కార్యాలయం కంప్యూటర్‌ ఆపరేటర్‌ వ్యవహార శైలిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది తెలియాలంటే వేచి చూడాల్పిందే.

Updated Date - 2023-06-07T00:28:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising