ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థుల ఖాతాలకే జేవీడీ

ABN, First Publish Date - 2023-03-10T23:36:19+05:30

ప్రభుత్వం అందించే జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన స్కాలర్‌షిప్పులు ఇకపై నేరుగా విద్యార్థుల ఖాతాలకే జమ చేయనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

జిల్లా కో-ఆర్డినేటర్‌ విశ్వమోహనరెడ్డి

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, మార్చి 10: ప్రభుత్వం అందించే జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన స్కాలర్‌షిప్పులు ఇకపై నేరుగా విద్యార్థుల ఖాతాలకే జమ చేయనున్నారు. ఇది వరకూ ఎనపీసీఐ (నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన ఆఫ్‌ ఇండియా) లింకింగ్‌ లేకపోవడంతో తల్లుల ఖాతాలకు జమ చేసేవారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏపీపీబీ బ్యాంకులలో విద్యార్థులతో అకౌంట్‌ ఓపెన చేయించి ఎనపీసీఐ లింకింగ్‌ చేయించాలని ఆదేశించినట్లు జేవీడీ జిల్లా కో-ఆర్డినేటర్‌ విశ్వమోహనరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కావున దగ్గర్లోనే పోస్టాఫీసులకు వెళ్లి ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకులో రూ.200 చెల్లిస్తే అకౌంట్‌ ఓపెన చేస్తారన్నారు. ఈ అకౌంట్‌కు ఎనపీసీఐ అనుసంధానం వెంటనే కావడంతో స్కాలర్‌షిప్పు నగదు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా నేరుగా విద్యార్థుల ఖాతాలకు జమవుతాయన్నారు. ఈ ఎనపీసీఐ లింకింగ్‌ లేకపోతే కేంద్రం వాటా అయిన 60 శాతం నగదు కోల్పోయే ప్రమాదముంటుందన్నారు. ఈ విషయంపై ఇప్పటికే అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఎస్సీ సంక్షేమశాఖ ఏఎ్‌సడబ్ల్యూఓ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా ఐపీపీబీ అకౌంట్‌ ఓపెన చేయకపోతే 7893436211, 8977037647, 9704777922, 9603743654 నెంబర్లలో సంప్రదించాలన్నారు.

Updated Date - 2023-03-10T23:36:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising