ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన.. సీమ ద్రోహి

ABN, First Publish Date - 2023-02-06T23:15:08+05:30

రాయలసీమకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగనరెడ్డి తీరని ద్రోహం చేస్తున్నారని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు.

గుంతకల్లులో విలేకరులతో మాట్లాడుతున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తశుద్ధి ఉంటే అప్పర్‌ భద్రను అడ్డుకోవాలి

ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన ఓటమే

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి

గుంతకల్లు, ఫిబ్రవరి 6: రాయలసీమకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగనరెడ్డి తీరని ద్రోహం చేస్తున్నారని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన స్థానిక మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడు క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ ప్రాంత రైతులకు నష్టం కలిగించే అప్పర్‌ భద్ర ప్రాజెక్టును అడ్డుకోవాలన్నారు. ఆ ప్రాజెక్టు ద్వారా సీమకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిసినా కనీసం అభ్యంతరం చెప్పడానికి కూడా చేతగాని దుస్థితిలో జగన ఉన్నాడన్నారు. కర్ణాటక ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఈ ప్రాజెక్టుకు తెరపైకి తెచ్చిందని, అంతర్రాష్ట్ర జలవివాదాలను ప్రేరేపించే ఈ ప్రాజెక్టుపై ఏపీ అభిప్రాయాన్ని కేంద్రం తీసుకోలేదని అన్నారు. జగనరెడ్డి కేసుల భయంతో కిమ్మనకుండా ఉన్నారని ధ్వజమెత్తారు. శ్రీబాగ్‌ ఒడంబడికలో రాయలసీమలో హైకోర్డుగానీ, రాష్ట్ర రాజధానిగానీ ఏర్పాటు చేయాలనే ఒప్పందం ఉండగా, ఆ విషయం ఎత్తకుండా జగన కేవలం హైకోర్టు గురించే మాట్లాడుతున్నారని అన్నారు. కర్నూలులో జ్యుడిషియల్‌ అకాడమీని ఏర్పాటు చేస్తామని గత అక్టోబరు 19న ఉత్తర్వు ఇచ్చి, మూడు రోజుల్లోనే మాటమార్చి.. దాన్ని మంగళగిరికి మార్చిన ద్రోహులు ఎవరని ప్రశ్నించారు. కృష్ణా యాజమాన్య బోర్డును రాయలసీమలోనో, డెల్టా ప్రాంతంలోనో పెట్టకుండా విశాఖపట్టణంలో ఎందుకు పెడుతున్నారో చెప్పాలన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు జగనకు తగిన బుద్ధిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జితేంద్రగౌడు మాట్లాడుతూ... పత్తి, కంది పంటలు దెబ్బతినగా పరిహారాలు ఇవ్వడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి పవనకుమార్‌ గౌడు, లీగల్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కృష్ణారెడ్డి, నాయకులు ఆమ్లెట్‌ మస్తాన యాదవ్‌, గుమ్మనూరు వెంకటేశులు, తలారి మస్తానప్ప, కేశప్ప, రిటైర్డు టీచరు చలపతి పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:15:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising