ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రైతులను దగా చేస్తున్న జగన ప్రభుత్వం

ABN, First Publish Date - 2023-09-26T00:23:34+05:30

తమది రైతు ప్రభుత్వం అని చెబుతూనే సీఎం జగన రైతులను దగా చేస్తున్నాడని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బీ గోవిందు విమర్శించారు.

గుంతకల్లుటౌన, సెప్టెంబరు 25: తమది రైతు ప్రభుత్వం అని చెబుతూనే సీఎం జగన రైతులను దగా చేస్తున్నాడని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బీ గోవిందు విమర్శించారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో సోమవారం రైతు సమస్యలపై సీపీఐ, టీడీపీ, సీపీఎం, సీపీఐఎంఎల్‌, జనసేన పార్టీ నాయకులతో రౌండ్‌ టేబుల్‌ సమావే శాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోవడంలేదన్నారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలన్నారు. రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలన్నారు. రైతు సమస్యలపై మంగళవారం కసాపురం రోడ్డులోని అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, నిరసన తెలుపుతామ న్నారు. సమావేశంలో సీపీఐ నాయకులు వీరభద్రస్వామి, మహేష్‌, రామాంజ నేయులు, ఎస్‌ఎండీ గౌస్‌, టీడీపీ నాయకులు పవనకుమార్‌ గౌడ్‌, రాయలరామయ్య, నందీశ్వర్‌, పాలమల్లికార్జున, సీపీఎం, సీపీఐఎంఎల్‌, జనసేన పార్టీనాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T00:23:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising