ఓటమి భయంతోనే అక్రమ కేసు : గుండుమల
ABN, First Publish Date - 2023-09-23T00:22:26+05:30
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందనే భయంతోనే టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడుపై అక్రమ కేసు నమోదు చేయించాడని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆరోపించారు.
గుడిబండ, సెప్టెంబరు 22: వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందనే భయంతోనే టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడుపై అక్రమ కేసు నమోదు చేయించాడని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆరోపించారు. శుక్రవారం గుడిబండలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చేస్తున్న సభలకు, నారాలోకేష్ చేపడుతున్న పాదయాత్రలో ప్రజల నుంచి వస్తుందన్న స్పందనను చూసి ఓర్వలేక ప్రజలు నీరాజనం పలుకుతుండటంతో అదిచూసి ఓర్వలేక చంద్రబాబునాయుడుపై అక్రమ కేసు బనాయించారని విమర్శించారు. చంద్రబాబునాయుడు 40ఏళ్ల రాజకీయ చరిత్రలో అవినీతి అక్రమాలకు పాల్పడలేదన్నారు. చంద్రబాబు కేసు నుంచి ఆణిముత్యంలా బయటకు వస్తారని అన్నారు. వచ్చే ఎన్నిక ల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్దిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రిలే నిరాహారదీక్ష కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ మద్దనకుంటప్ప, టీడీ పీ నాయకులు దుర్గేష్, మంజునాథ్, షబ్బీర్, శివకుమార్, లక్ష్మీనరసప్ప, పురుషోత ్తం, భీమరాజు, నజీర్, భోజరాజు, వెంకటేశ, రవిశంకర్, నాగరాజు, నాగేంద్రప్ప, రామదామన్న తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-23T00:22:26+05:30 IST