ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వీసీగా కొనసాగేందుకే విగ్రహ రాజకీయం

ABN, First Publish Date - 2023-07-21T00:45:29+05:30

ఎస్కేయూ వీసీ రామకృష్ణారెడ్డి తన పదవీ కాలం కొనసా గింపునకు ప్రభుత్వ పెద్దల మన్ననలు పొందేందుకు విగ్రహ రాజకీయాలు చేస్తున్నారని ఏఐఎస్‌ఏ, ఏఐఎస్‌ఎఫ్‌ సంఘాల నాయకులు మండిపడ్డారు.

నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు

అనంతపురం సెంట్రల్‌, జూలై 20: ఎస్కేయూ వీసీ రామకృష్ణారెడ్డి తన పదవీ కాలం కొనసా గింపునకు ప్రభుత్వ పెద్దల మన్ననలు పొందేందుకు విగ్రహ రాజకీయాలు చేస్తున్నారని ఏఐఎస్‌ఏ, ఏఐఎస్‌ఎఫ్‌ సంఘాల నాయకులు మండిపడ్డారు. వర్సిటిలో వైస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహ ఏర్పాటును ఖండిస్తూ ఏఐఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమన, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్ష కుళ్లాయిస్వామి, చిరంజీవి గురువారం నిరసన తెలిపారు. ఎస్కేయూ వీసీ పదవిని అర్హతలేని రామకృష్ణారెడ్డికి కట్టబెట్టి విద్యా ర్థుల భవిష్యత్తును ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్‌ కాలరాశారన్నారు. రామకృష్ణారెడ్డి తన మూడేళ్ల పదవీకాలంలో వేలాది మంది విద్యార్థులను డీటైన చేయడం, ఫీజులు పెంచారన్నారు. అదేవిధంగా ఉద్యోగులను సంస్పెండ్‌ చేయడం, ఉద్యోగోన్నతుల్లో మామూళ్లు ఇచ్చిన వారికి పదోన్నతలు కల్పించడం.. నచ్చని వారికి రివర్స్‌ ఇవ్వడం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర గవర్నర్‌ స్పందించి రామకృష్ణారెడ్డిని రీకాల్‌చేసి విగ్రహ ఏర్పాటును అడ్డుకోకపోతే విద్యార్థుల తరపున పోరాటం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు హనుమంతు, రజనీ, ఉమామహేష్‌, నారాయణ స్వామి, మంజు, విష్ణు, ప్రకాష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-07-21T00:45:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising