కుష్ఠు లక్షణాలున్న వారిని గుర్తించండి
ABN, First Publish Date - 2023-08-26T23:55:31+05:30
ప్రాథమిక దశలోనే కుష్ఠు వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించి.. చికిత్స అందిస్తే అంగవైకల్యం నివారించవచ్చని జిల్లా కుష్టువ్యాధి విభాగాధికారి డాక్టర్ అనుపమ జేమ్స్ అన్నారు.
జిల్లా పోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనుపమ జేమ్స్
అనంతపురం టౌన, ఆగస్టు 26: ప్రాథమిక దశలోనే కుష్ఠు వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించి.. చికిత్స అందిస్తే అంగవైకల్యం నివారించవచ్చని జిల్లా కుష్టువ్యాధి విభాగాధికారి డాక్టర్ అనుపమ జేమ్స్ అన్నారు. శనివారం తన చాంబర్‌లో కుష్ఠు నివారణ, సర్వేపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కుష్ఠువ్యాధికి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఆరు లేదా ఏడాది పాటు మందులు తీసుకుంటే ఈ వ్యాధి పూర్తిగా తగ్గిపోతుందని అన్నారు. కుష్ఠును పూర్తీగా అంతమొందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయని, అందులో భాగంగానే కుష్ఠు లక్షణాలు ఉన్నవారిని గుర్తించేందుకు సర్వే చేపడుతున్నామని అన్నారు. వ్యాధి లక్షణాలున్న వారికి అవసరమైన మందులు, ఇతర వస్తువులు ఉచితంగా ఇస్తామని, సర్వే పక్కాగా చేపట్టి కొత్త కేసులు వస్తే వారి వివరాలను ఆనలైన పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో డాక్టర్ అన్వర్‌బాషా, పారామెడికల్ అధికారి నాగన్న, సూర్యప్రకాష్ పాల్గొన్నారు.
Updated Date - 2023-08-26T23:56:48+05:30 IST