ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఘనంగా పవనకళ్యాణ్‌ జన్మదినం

ABN, First Publish Date - 2023-09-03T00:00:38+05:30

జనసేన అధినేత పవనకళ్యాణ్‌ జన్మదిన వేడుకలను ఆ పార్టీ కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్‌ ఆధ్వర్యంలో నగరంలో శనివారం ఘనంగా నిర్వహించారు.

అనంతపురం : దుస్తులు పంపిణీ చేస్తున్న స్వామినాయుడు, భవానీ రవికుమార్‌

ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌ : జనసేన అధినేత పవనకళ్యాణ్‌ జన్మదిన వేడుకలను ఆ పార్టీ కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్‌ ఆధ్వర్యంలో నగరంలో శనివారం ఘనంగా నిర్వహించారు. అఖిలభారత చిరంజీవి యువత వ్యవస్థాపకుడు రవనం స్వామినాయుడు కేక్‌ కటింగ్‌ చేశారు. జనసేన పార్టీ రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత నగరంలోని బైబిల్‌ మిషన చర్చి సొసైటీ ఆశ్రమంలో అనాథ విద్యార్థుల మధ్య కేక్‌ కటింగ్‌ చేశారు. నగరంలోని ఆదిమూర్తి నగర్‌లోని లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌లో ముక్కోటి అంబిక సేవా ట్రస్ట్‌ అధినేత దంపెట్ల శివ కేట్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఉచితంగా ఫారెన ల్యాంగ్వేజ్‌ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించారు. గార్లదిన్నెలో జనసేనా పార్టీ నాయకులు మూలి శ్రీకాంతరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నరసింహా, కాశీం, రమేష్‌ పాల్గొన్నారు. నార్పలలో జనసేన పార్టీ, భవన నిర్మాణ కార్శికుల ఆధ్యర్యంలో ఘనంగా నిర్వహించారు. శింగనమల మండలం నాగుల గుడ్డంతండా గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళికృష్ణ, జిల్లా కార్యదర్శి చొప్ప చంద్రశేఖర్‌, మండల కన్వీనర్‌ తోట ఓబిలేసు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-03T00:00:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising