ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే లైన్ల అభివృద్ధికి గ్రీన సిగ్నల్‌

ABN, First Publish Date - 2023-02-02T00:06:00+05:30

కేంద్ర బడ్జెట్లులో రైల్వేకు లభించిన నిధులలో అగ్రభాగం ప్రధాన రైలు మార్గాల అభివృద్ధికి వినియోగించనున్నారు. అలాగే ఏ1, ఏ, బీ క్లాస్‌ స్టేషన్లు అభివృద్ధికి నోచుకోనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాగుపడనున్న రైల్వే స్టేషన్లు

కేంద్ర బడ్జెట్‌తో ఆశలు

పింక్‌ బుక్‌ వస్తే స్పష్టత

గుంతకల్లు, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్లులో రైల్వేకు లభించిన నిధులలో అగ్రభాగం ప్రధాన రైలు మార్గాల అభివృద్ధికి వినియోగించనున్నారు. అలాగే ఏ1, ఏ, బీ క్లాస్‌ స్టేషన్లు అభివృద్ధికి నోచుకోనున్నాయి. రైల్వేకు జరిగిన కేటాయింపుల్లో ప్రాథమికంగా లభించిన సమాచారమిది. ఈ మేరకు స్థానిక కేటాయింపుల సంగతి తేటతెల్లంకాలేదు. బడ్జెట్‌ వెల్లడైన తర్వాత రైల్వే కేటాయింపుల పూర్తి వివరాలను వెల్లడిస్తూ ఆ శాఖ నుంచి పింక్‌ బుక్‌ను విడుదలచేయడం ఆనవాయితీ. పింక్‌ బుక్‌ వస్తేతప్ప గుంతకల్లు రైల్వే డివిజన స్థాయిలో ఏమేరకు కేటాయింపులు జరిగాయో సంపూర్ణ వివరాలు వెల్లడి కానున్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు తిరుపతి, గుంతకల్లు, రేణిగుంట, గుత్తి, ధర్మవరం, అనంతపురం, కడప, తదితర రైల్వే స్టేషను అభివృద్ధికి నోచుకోనున్నాయి. అలాగే డివిజన మీదుగా వెళ్లే బెంగళూరు, ముంబై, హుబ్లీ, విజయవాడ, చెన్నై క్వాడ్రాంగిల్‌ రైలు మార్గాలు అభివృద్ధి చెందనున్నాయి. అలాగే పుణ్యక్షేత్రాలు, గిరిజన ప్రాంతాల రైలు మార్గాలు, ఘాట్‌ ఏరియాలు తదితర మార్గాలలో ఇనఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం.

Updated Date - 2023-02-02T00:06:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising