ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు

ABN, First Publish Date - 2023-03-27T00:01:27+05:30

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలను జిల్లావ్యాప్తంగా ఆదివారం పార్టీ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెనుకొండ, మార్చి 26: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలను జిల్లావ్యాప్తంగా ఆదివారం పార్టీ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు. పెనుకొండ టీడీపీ కార్యాలయంలో జిల్లా అ ధ్యక్షుడు బీకే పార్థసారథి ఆధ్వర్యంలో నాయకులు కేక్‌ కట్‌చేసి అచ్చెన్నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఒకరినొకరు కేక్‌ తినిపించుకున్నారు. కార్యక్రమంలో నాయకులు జీవీపీ నాయుడు, ము నిమడుగు వెంకటరాముడు, కురుబ కృష్ణమూర్తి, పోతిరెడ్డి, దారపునేని రా మలింగ, బెల్లం శివశంకర్‌, సిద్దయ్య, రవిశంకర్‌, రఘువీరచౌదరి, హుజురుల్లాఖాన, జావిద్‌, గాయిత్రి, సాయిప్రసాద్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

సవిత ఆధ్వర్యంలో...

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఆధ్వర్యంలో అచ్చెన్నాయు డు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెనుకొండలోని అన్న క్యాంటీన ఎదుట కేక్‌ కట్‌చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఒకరికొకరు కేక్‌ తినిపించుకున్నారు. కార్యక్రమంలో నాయకులు గు ట్టూరు సూరి, త్రివేంద్రనాయుడు, శ్రీరాములు, బాబుల్‌రెడ్డి, ఈశ్వరప్రసాద్‌, వాసుదేవరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

మడకశిరటౌన: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలను పట్టణంలో ఆపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి ఆ ధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌చేసి అచ్చెన్నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు డాక్టర్‌ శ్రీనివాసమూర్తి, ఆర్‌ జయకుమార్‌, మనోహర్‌, లక్ష్మీనారాయణ, తిమ్మరాజు, రవి, డాక్టర్‌ కృష్ణమూర్తి, ఉమాశంకర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-27T00:01:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising