గోరంట్ల వాసి అయోధ్యలో మృతి
ABN, First Publish Date - 2023-06-18T00:04:44+05:30
మండలంలోని పులేరు గ్రామానికి చెందిన ఇరుగరాజుపల్లి రంగప్ప(59) యాత్ర బస్సులో వెళ్లి అయోధ్యలో గుండెపోటుకు గురై శనివారం తెల్లవారుజామున మరణించారు.
గోరంట్ల, జూన 17 : మండలంలోని పులేరు గ్రామానికి చెందిన ఇరుగరాజుపల్లి రంగప్ప(59) యాత్ర బస్సులో వెళ్లి అయోధ్యలో గుండెపోటుకు గురై శనివారం తెల్లవారుజామున మరణించారు. మృతుడి సోదరుడు సూరి తెలిపిన వివరాల మేరకు ... పులేరు గ్రామస్థుడైన రంగప్ప శుభకార్యా లకు వంటలు వండిపెడుతూ జీవనం సా గించేవారు. గోరంట్ల నుంచి కాశీ, బద్రినాథ్, తదితర పుణ్యక్షేత్రాలకు 28రోజుల యాత్రలో ప్రయాణికులకు వంట వండిపెట్టడానికి ఈనెల 4న బస్సులో బయలుదేరి వెళ్లారు. కాశీ తరువాత అయోధ్యకు వెళ్లగానే అస్వస్థతకు గురై బస్సులోనే గుండెపోటుతో మరణించారన్నారు. మృతుడికి భార్య యశోదమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తె ఉన్నారు. రంగప్ప మృతదేహాన్ని అయోధ్య నుంచి ప్రత్యేక వాహనంలో పులేరుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. పులేరు గ్రామంలోని బంధువులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.
Updated Date - 2023-06-18T00:04:44+05:30 IST