ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డెక్కిన రైతన్న

ABN, First Publish Date - 2023-01-30T23:29:53+05:30

వ్యవసాయానికి విద్యుత సక్రమంగా సరఫరా చేయట్లేదంటూ రైతులు రోడ్కెక్కారు. మండలంలోని కొండగట్టుపల్లి పంచాయతీలోని పాముదుర్తికొట్టాల రైతులు సోమవారం సాయంత్రం స్థానిక విద్యుత సబ్‌స్టేషన ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు.

ముదిగుబ్బలో రోడ్డుపై బైఠాయించిన రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యవసాయానికి విద్యుత సక్రమంగా సరఫరా చేయట్లేదని ఆవేదన

ముదిగుబ్బలో రహదారిపై బైఠాయింపు

ముదిగుబ్బ, జనవరి 30: వ్యవసాయానికి విద్యుత సక్రమంగా సరఫరా చేయట్లేదంటూ రైతులు రోడ్కెక్కారు. మండలంలోని కొండగట్టుపల్లి పంచాయతీలోని పాముదుర్తికొట్టాల రైతులు సోమవారం సాయంత్రం స్థానిక విద్యుత సబ్‌స్టేషన ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు. పాముదుర్తికొట్టాల, ఎం.కొట్టాలా, ఎనఎస్పీ కొట్టాల, ఏబీపల్లితండా పరిధిలోని రైతులు వేరుశనగ, టమోటా తదితర పంటలుసాగు చేశామనీ, విద్యుత సక్రమంగా సరఫరా చేయట్లేదనీ, దీంతో పంటలు ఎండుదశకు చేరుతున్నాయని ఆవేదన చెందారు. దీంతో ట్రాన్సకో అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్సకో అధికారులు స్పందించి, విద్యుత సమస్యను పరిష్కరించాలని కోరారు. విషయం తెలుసుకున్న పోలీసులు రైతుల వద్దకు చేరుకుని, ధర్నాకు అనుమతి లేదనీ, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని తెలిపారు. దీంతో రైతులు వెనుదిరిగారు. ఈ విషయంపై ట్రాన్సకో ఏఈ చంద్రానాయక్‌ను వివరణ కోరగా.. ఓవర్‌లోడ్‌ కారణంగా సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. లోడ్‌ డైవర్ట్‌ ద్వారా సమస్యను పరిష్కరిస్తామన్నారు.

Updated Date - 2023-01-30T23:29:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising