ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా ధ్వజారోహణం

ABN, First Publish Date - 2023-05-04T00:05:13+05:30

మండల పరిధిలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.

ధ్వజ స్తంభం వద్ద పూజలు నిర్వహిస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉరవకొండ, మే 3: మండల పరిధిలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ధ్వజరోహణ కార్యక్రమాన్ని ఆలయ ప్రధానఅర్ఛకులు ద్వారకానాథాచార్యులు శాస్రోక్తంగా నిర్వహించారు. స్వామి వారి బ్రహ్మోత్సవానికి ముక్కోటి దేవతలను స్వామి వారి తరపున ఆహ్వానిస్తూ ధ్వజానికి మూలకారణమైన గరుత్మంతుడుని చిత్రపటాన్ని ఆవిష్కరించడం జరిగిందని అర్చకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తిలకించారు. రాత్రి ప్రాకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాతలుగా పెద్దముష్టూరుకు చెందిన గుండ్రాయప్ప, పెద్ద ఓబన్న కుటుంబ సభ్యులు వ్యవహరించారు. కార్యక్రమంలో ఈవో విజయ్‌ కుమార్‌, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వామివారి జయంతి, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనోత్సవాలు నిర్వహించనున్నారు.

Updated Date - 2023-05-04T00:05:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising