సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ABN, First Publish Date - 2023-06-26T00:17:21+05:30
సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కమ్మ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకటరావు పేర్కొ న్నారు.
కమ్మ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరావు
గుత్తి, జూన 25: సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కమ్మ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకటరావు పేర్కొ న్నారు. ఆదివారం స్థానిక శ్రీనివాస ఫంక్షన హాల్‌లో గుత్తి మండల కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమేళ్మనం నిర్వహించారు. ముందుగా మాజీ జడ్పీ చైర్మన కేసీ నారాయణకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వెంకటరావు మాట్లాడు తూ అమరావతి రైతులు పాదయాత్రకు ఏపీలోని ప్రతి సంఘం నాయకుడు మద్దతు తెలిపారన్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కమ్మ సంఘం తీర్మానించాలన్నారు. కమ్మ సేవా సంఘంలోని పేద వారికి విద్య, వైద్య పరంగా ఆర్థిక సాయం అందించేందుకు ముందుండాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమాపతి నాయుడు, అయోధ్యరామయ్య, కేసీ హరి, బోసుబాబు, రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వర రావు, సంయుక్త కార్యదర్శులు తమ్మినేని రమేష్ బాబు, పరుచూరి శ్రీనివాస రావు, కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు కృష్ణమోహన, వెంకటరమణ, వైకుంఠం మల్లికార్జున చౌదరి, ప్రభాకర్ చౌదరి, మండల సంఘం అధ్యక్షుడు గోరంట్ల నాగరాజు, పామిడి అధ్యక్షుడు బండారు రామాంజినేయులు, స్థానిక అధ్యక్ష, కార్యదర్శలు బోర్‌వెల్ నాగరాజు, కోనంకి కృష్ణ, రవితేజ నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-26T00:17:21+05:30 IST