ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖబరస్తానలో రాజకీయాలు అందరికీ తెలుసు

ABN, First Publish Date - 2023-02-06T23:48:44+05:30

పట్టణంలోని గాంధీనగర్‌ ఖబరస్తాన విషయంలో రాజకీయాలు చేస్తోంది ఎవరో ప్రజలందరికీ తెలుసుననీ, అన వసరంగా ఇందులో రాజకీయాలు చేయడం మానుకోవాలని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజల మనోభావాలు దెబ్బతింటే టీడీపీ స్పందిస్తుంది

కేతిరెడ్డిపై పరిటాల శ్రీరామ్‌ ఆగ్రహం

ధర్మవరం, ఫిబ్రవరి 6: పట్టణంలోని గాంధీనగర్‌ ఖబరస్తాన విషయంలో రాజకీయాలు చేస్తోంది ఎవరో ప్రజలందరికీ తెలుసుననీ, అన వసరంగా ఇందులో రాజకీయాలు చేయడం మానుకోవాలని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ స్థానిక కార్యాల యంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ముస్లింలతో కలిసి పట్టణంలోని ఖబరస్తాన సమాధుల కూల్చివేత అంశం పై పరిటాల శ్రీరామ్‌ ఘాటుగా స్పందించారు. నెలరోజుల క్రితం జరిగిన ఈ సంఘటనపై ఎమ్మెల్యేకేతిరెడ్డి ఇప్పుడెందుకు మాట్లాడారని ప్రశ్నిం చారు. ముస్లింల సమాధులను ఇష్టానుసారంగా కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సమస్య పరిష్కారం అయిందని అనుకున్న సమయంలో కేతిరెడ్డి మరోసారి చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో మీ పాత్ర లేకుంటే విజయవాడ నుంచి హడావుడిగా ఎందుకు పరుగెత్తుకుంటూ వచ్చారని ప్రశ్నించారు. జామీయా మసీదు ముతవల్లిని ఇష్టానుసారం తిట్టిన విషయాన్ని శ్రీరామ్‌ తప్పుబట్టారు. ఖబరస్తాన విషయంలో తాను మొదటి నుంచి చెబుతున్నట్లు మసీదు కమిటీలు అన్ని కలిసి ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాలన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే తక్షణమే టీడీపీ స్పందిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కమతంకాటమయ్య, ముస్లీం మైనార్టీ నాయకులు నాగూర్‌హుస్సేన, రాళ్లపల్లి షరీఫ్‌, క్రిష్ణాపురం జమీర్‌ అహమ్మద్‌, పఠానబాబూఖాన, మహిళా నేతలు సాహెబ్బీ, బీబీ, షామీర్‌, ఇర్షాద్‌, మాబు, ఇమాం, బాబాఫకృద్దీన పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:48:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising