ఐక్య ఉద్యమాలతోనే సమానత
ABN, First Publish Date - 2023-03-05T00:35:07+05:30
ఐక్య ఉద్యమాలతోనే సామాజిక సమానత సాధ్యమని ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి పేర్కొన్నారు.
ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి
అనంతపురం కల్చరల్, మార్చి 4: ఐక్య ఉద్యమాలతోనే సామాజిక సమానత సాధ్యమని ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి పేర్కొన్నారు. శనివారం స్థానిక గణేనాయక్ భవనలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతియేటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐద్వాతోపాటు యూటీఎఫ్, సీఐటీయూ, ఏడబ్ల్యూడబ్ల్యూయూ, ఆశా, ఎండీఎం, ఎస్‌ఎ్‌ఫఐ, డీవైఎ్‌ఫఐ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని టీటీడీ కల్యాణమండపంలో ఉదయం 10 గంటలకు వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ’సమానతను సాధించుకుందాం - ఐక్య ఉద్యమాలను బలపరుచుకుందాం’ అనే అంశంపై నిర్వహించే సదస్సుకు కేరళ రాష్ట్ర మాజీ ఆరోగ్యశాఖమంత్రి పీకే శ్రీమతి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తారన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేశి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగమణి, నాగేంద్రకుమార్, చంద్రశేఖర్‌రెడ్డి, చంద్రిక, జయభారతి, యశోద, రామాంజినమ్మ, నరసింహారెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2023-03-05T00:35:07+05:30 IST