ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి సామాజిక తనిఖీ అభాసుపాలు

ABN, First Publish Date - 2023-03-25T23:54:47+05:30

మండలంలో ఉపాధి హామీ పథకం అమలు అభాసుపాలవుతోంది. సామాజిక తనిఖీ బృందం క్షేత్రస్థాయి పనుల పరిశీలనకు డుమ్మా కొడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

క్షేత్రస్థాయి పనుల పరిశీలన డుమ్మా

కూలీలను కార్యాలయానికి పిలిచి విచారణ

రొళ్ల, మార్చి 25: మండలంలో ఉపాధి హామీ పథకం అమలు అభాసుపాలవుతోంది. సామాజిక తనిఖీ బృందం క్షేత్రస్థాయి పనుల పరిశీలనకు డుమ్మా కొడుతున్నారు. కూలీల వలసలకు అడ్డుకట్ట వే సేందుకు స్థానికంగా పనులు కల్పించాలన్నది ఉపాధి పథకం ల క్ష్యం. పథకం అమలు క్షేత్రస్థాయిలో సవ్యంగా జరుగుతోందా? కూలీలకు పూర్తిస్థాయిలో న్యాయం చేకూరుతోందా? తెలుసుకోవడానికి సామాజిక తనిఖీ బృందాలను నియమించారు. ఈబృందం మండ లంలో పథకం లక్ష్యాన్ని నిర్వీర్యం చేస్తోందని కూలీలు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో జరిగిన పనులను పరిశీలించి, కూలీల ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టాల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధంగా కూ లీలు, పింఛనుదారులను సచివాలయానికి పిలిపించి, విచారించిన ట్లు తెలిసింది. రొళ్లకు సంబంధించిన పింఛనుదారులు కూలీలను సామాజిక తనిఖీ బృందం శనివారం సచివాలయానికి పిలిపించుకొని విచారణ చేపట్టారు. కూలీలను వివరణ కోరగా, సామాజిక త నిఖీ నిమిత్తం తమను గ్రామ సచివాలయానికి పిలిపించారని తెలి పారు. విషయం తెలుసుకొన్న సామాజిక తనిఖీ బృందం వెంటనే వారిని అక్కడి నుంచి పంపించివేశారు. ఉపాధి హామీ పథకం సక్రమంగా అమలయ్యేలా, పింఛనుదారులకు పింఛను పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి, అవినీ తి, అక్రమాలు అరికట్టడానికి సామాజిక తనిఖీ బృందాన్ని నియమించింది. కానీ క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా నామమాత్రం గా విచారణ చేపట్టి చేతులుదులుపుకున్నారని ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి సామాజిక తనిఖీ పూ ర్తిస్థాయిలో జరిగేలా చూడాలని కూలీలు కోరుతున్నారు.

Updated Date - 2023-03-25T23:54:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising