జిల్లా ఎస్పీగా కంచి శ్రీనివాసరావు
ABN, First Publish Date - 2023-04-09T00:51:25+05:30
జిల్లాకు కొత్త సూపరింటెండెంట్ ఆఫ్ పోలీ్‌స(ఎస్పీ)గా కంచి శ్రీనివాసరావు రానున్నారు. ప్రస్తుత ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్పను సీఐడీ ఎస్పీగా బదిలీ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీల ఉత్తర్వులు వెలువడ్డాయి.
సీఐడీ ఎస్పీగా ఫక్కీరప్ప బదిలీ
డీఐజీ రవిప్రకాష్ సెబ్‌కు
కొత్త డీఐజీ అమ్మిరెడ్డి
14వ బెటాలియన కమాండెంట్ అజిత బదిలీ
అనంతపురం క్రైం, ఏప్రిల్ 8: జిల్లాకు కొత్త సూపరింటెండెంట్ ఆఫ్ పోలీ్‌స(ఎస్పీ)గా కంచి శ్రీనివాసరావు రానున్నారు. ప్రస్తుత ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్పను సీఐడీ ఎస్పీగా బదిలీ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీల ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లా ఎస్పీతో పాటు అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్, ఏపీఎస్పీ 14వ బెటాలియన కమాండెంట్ అజిత వేజెండ్లను బదిలీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న కంచి శ్రీనివాసరావును అనంతపురం ఎస్పీగా నియమించారు. అనంతపురం రేంజ్ డీఐజీ ఎం.రవిప్రకా్‌షను సెబ్ డీఐజీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ఆర్‌ఎన అమ్మిరెడ్డిని నియమించారు. ఏపీఎస్పీ 14వ బెటాలియన కమాండెంట్ అజిత వేజెండ్లను విజయవాడ డీసీపీగా బదిలీపై పంపారు. ఆమె స్థానంలో చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన)గా ఉన్న పి.జగదీ్‌షను నియమిం చారు. నూతన డీఐజీగా రానున్న ఆర్‌ఎన అమ్మిరెడ్డి 2009 ఐపీఎస్ బ్యాచకు చెందిన వారు. ఈయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి. బదిలీపై జిల్లాకు రానున్న అధికారులు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.
తొలి సారి ఎస్పీగా...
జిల్లాకు ఎస్పీగా రానున్న కంచి శ్రీనివాసరావు స్వస్థలం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. 2009 గ్రూప్-1 ద్వారా డీఎస్పీ పోస్టు సాధించారు. తొలుత వనపర్తి, కొవ్వూరులలో డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఆ తరువాత సీఐడీ డీఎస్పీగా పనిచేశారు. అడిషనల్ ఎస్పీగా ఉద్యోగోన్నతి పొందాక విశాఖపట్నం డీసీపీగా, శ్రీకాకుళం అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. మరోసారి ఉద్యోగోన్నతి పొంది విజయవాడ ట్రాఫిక్ డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాకు తొలిసారి ఎస్పీగా రానున్నారు.
Updated Date - 2023-04-09T00:51:25+05:30 IST