మిషన రాయలసీమ కరపత్రాల పంపిణీ
ABN, First Publish Date - 2023-07-25T23:48:47+05:30
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ యువగళం పాదయాత్రలో విడుదల చేసిన మిషన రాయలసీమ డిక్లరేషన కరపత్రా లను తెలుగు యువత ఆధ్వర్యంలో ప్రజలకు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు.
పెనుకొండ, జూలై 25: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ యువగళం పాదయాత్రలో విడుదల చేసిన మిషన రాయలసీమ డిక్లరేషన కరపత్రా లను తెలుగు యువత ఆధ్వర్యంలో ప్రజలకు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు. తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పుల్లప్పచౌదరి, అంబులెన్స రమేష్, రాష్ట్ర కార్యదర్శి నరేష్‌కుమార్ యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి జావిద్‌బాష, నియోజకవర్గ అధ్యక్షుడు రియాజ్ బాషా ఆధ్వర్యంలో మంగళవారం ఈ కార్యక్రమం సాగింది. పెనుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులో బస్సుల్లోని ప్రయాణికులకు, హోటళ్లలో, దుకాణాలలో కరపత్రాలను పంచుతూ డిక్లరేషన ముఖ్య ఉద్దేశ్యాన్ని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ సురేంద్రయాదవ్, జిల్లా కమిటీ సభ్యులు బళ్లారి సుధాకర్, జానకంపల్లి శ్రీనివాసరెడ్డి, హిందూపురం నియోజకవర్గం కమిటీ సభ్యుడు యువతేజ, నాయకులు మారుతి, సురేష్, మంజునాథ్, అల్తాఫ్, సాదిక్, షఫీ, రఫీ, దాదు, ప్రశాంత చౌదరి, నాగేష్, శేషు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-07-25T23:48:47+05:30 IST