సైకో పాలనకు రోజులు దగ్గరపడ్డాయ్: టీఎనఎస్‌ఎఫ్
ABN, First Publish Date - 2023-09-22T00:03:35+05:30
సైకో జగన పాలనకు రోజులు దగ్గరపడ్డాయని టీఎనఎస్‌ఎఫ్ నాయకులు మండిపడ్డారు.
హిందూపురం, సెప్టెంబరు 21 : సైకో జగన పాలనకు రోజులు దగ్గరపడ్డాయని టీఎనఎస్‌ఎఫ్ నాయకులు మండిపడ్డారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ అన్యాయం, అప్రజాస్వామికం, బాబుకోసం నేనుసైతం అం టూ పట్టణంలో గురువారం చేపట్టిన రిలే నిరాహారదీక్షలో వారు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కక్ష గట్టి వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తగినగుణపాఠం చెబుతార న్నారు. వారికి సంఘీభావంగా టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం లో టీఎనఎస్‌ఎఫ్ నాయకులు అభి, అమీన, ఇందాద్, నరేష్, విశ్వనాథ్‌రెడ్డి, యుగందర్, మంజునాథ్, రవీంద్రనాయుడు, ఆంజనేయులు పాల్గొన్నారు.
బాబు విడుదల కోసం మైనార్టీల దీక్ష
గుడిబండ, సెప్టెంబరు 21 : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసిన చంద్రబాబు నాయుడును వెంటనే విడుదల చేయాలని కోరు తూ ముస్లిం మైనార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని రాళ్లపల్లి జామియా మసీదులో గురువారం టీడీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు భక్తర్, నియోజకవ ర్గం అధ్యక్షుడు నజీర్‌అహ్మద్, మండల అధ్యక్షుడు షబ్బీ ర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబు విడుదల కావాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సత్తార్‌సాబ్, నూరానసాబ్, రియాజ్, దాదు, సనావుల్లా, నాసీర్, నదీంబాష తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-22T00:03:35+05:30 IST