ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడ్డగోలు బదిలీ ఉత్తర్వులు వెనక్కు తీసుకోవాలి

ABN, First Publish Date - 2023-06-07T00:32:01+05:30

బదిలీల్లో స్టేట్‌ ఆడిట్‌ శాఖ డైరెక్టర్‌ ఇచ్చిన అడ్డగోలు బదిలీ ఉత్తర్వులను వెంటనే వెనక్కు తీసుకోవాలని ఎన్జీవో సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

జిల్లా ఆడిట్‌ ఆఫీసర్‌కు వినతిపత్రం ఇస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్జీవో, ఆడిట్‌ అధికారుల నిరసన

అనంతపురం విద్య, జూన 6: బదిలీల్లో స్టేట్‌ ఆడిట్‌ శాఖ డైరెక్టర్‌ ఇచ్చిన అడ్డగోలు బదిలీ ఉత్తర్వులను వెంటనే వెనక్కు తీసుకోవాలని ఎన్జీవో సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఎన్జీవో సంఘం నాయకులు, ఆడిట్‌ అధికారులు జడ్పీలోని ఆడిట్‌ ఆఫీస్‌ ఎదుట నిరసన చేపట్టారు. ఈసందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రెడ్డి, నగర అధ్యక్షుడు మనోహర్‌ మాట్లాడారు. ఏన్జీవో సంఘం నాయకులకు బదిలీల్లో మినహాయింపు ఉందన్నారు. అయితే ఆడిట్‌ శాఖలో అసోసియేషన బేరర్లపై కూడా వేధింపులు కొనసాగుతున్నాయన్నారు. గత నెల 31వ తేదీనే బదిలీలు ముగిస్తే, ఆతర్వాత మూడు రోజులు వరుసగా రోజుకో అడ్డగోలు ఆర్డర్లు ఇచ్చారన్నారు. నాయకులు, ఉద్యోగులను బెదిరింపులకు గురిచేశారంటూ మండిపడ్డారు. జీవో 71 మేరకు గత నెల 31 నాటికి ఆర్‌డీడీ ఇచ్చిన బదిలీల ఉత్తర్వులను కాకుండా, డైరెక్టర్‌ ఏకపక్షంగా నియంతృత్వ ధోరణితో ఉత్తర్వులు ఇవ్వడం సబబుకాదన్నారు. ఆడిట్‌ డైరెక్టర్‌ ఇచ్చిన బదిలీల ఉత్తర్వుల హేయమన్నారు. 6న ఇచ్చిన బదిలీల ఉత్తర్వుల్లో అసోసియేషన బేరర్లు దస్తగిరి, అజయ్‌కుమార్‌, మరికొందరిని బలవంతంగా బదిలీ చేయడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. 10 నెలల సర్వీసు ఉన్న వారిని కూడా బదిలీ చేశారన్నారు. వెంటనే డైరెక్టర్‌ ఇచ్చిన ఆర్డర్స్‌ను రద్దు చేయాలని కోరారు. లేకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా ఆడిట్‌ ఆఫీసర్‌ ఇందిరకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కోశాధికారి బషీర్‌ అహమ్మద్‌, నగర కోశాధికారి విష్ణువర్ధన, జిల్లా సంయుక్త కార్యదర్శి అజయ్‌కుమార్‌, దస్తగిరి, శ్రీనివాసులు, ఆడిట్‌ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T00:32:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising