ప్రత్యేక రైళ్ల కొనసాగింపు
ABN, First Publish Date - 2023-03-17T00:56:38+05:30
అహ్మదాబాద్-తిరుచునాపల్లి- అహ్మదాబాద్ మధ్య (వయా గుంతకల్లు) నడుస్తున్న ప్రత్యేక వీక్లీ రైలును మరిన్ని రోజులు కొనసాగించనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఉదయం ఓ ప్రకటనలో తెలిపారు.
గుంతకల్లు, మార్చి 16: అహ్మదాబాద్-తిరుచునాపల్లి- అహ్మదాబాద్ మధ్య (వయా గుంతకల్లు) నడుస్తున్న ప్రత్యేక వీక్లీ రైలును మరిన్ని రోజులు కొనసాగించనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఉదయం ఓ ప్రకటనలో తెలిపారు. అహ్మదాబాద్-తిరుపునాపల్లి (నెం. 09419) ప్రత్యేక రైలు ఏప్రిల్ 6వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకూ 8 ట్రిప్పులు నడపనున్నట్లు తెలియ జేశారు. ఈ రైలు అహ్మదాబాద్‌లో (గురువారాలలో) ఉదయం తొమ్మిది న్నరకు బయలుదేరి, శనివారం తెల్లవారుజాము 3-45 గంటలకు తిరుచు నాపల్లికి చేరుకుంటుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలును (నెం. 09420) ఏప్రిల్ 9వ తేదీ నుంచి మే 28వ తేదీ వరకూ నడుపుతామన్నారు. ఈ రైలు తిరుచునాపల్లిలో (ఆదివారాలలో) ఉదయం 5-45 గంటలకు బయ లుదేరి మరుసటిరోజు రాత్రి 9-15 గంటలకు అహ్మదాబాద్‌కు చేరుతుం దన్నారు. ఈ రైలు వడోదర, సూరత, వాపి, వసాయి రోడ్, కల్యాణ్, పూణే, షోలాపూర్, కలబురిగి, వాడి, రాయచూర్, మంత్రాలయం రోడ్డు, గుంతకల్లు, తాడిపత్రి, కడప, రేణిగుంట, అరక్కోణం, పెరంబూరు, చెన్నై ఎగ్మోర్, తాం బరం, చెంగల్పట్టు, విల్లుపురం, చిదంబరం, సిర్కాజి, వైతేశ్వరనకోయిల్, కుంభకోణం, పాపనాశం, తంజావూర్ స్టేషన్ల మీదుగా నడుస్తుందన్నారు.
Updated Date - 2023-03-17T00:56:38+05:30 IST