ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగనాసురుడు

ABN, First Publish Date - 2023-05-02T00:13:51+05:30

జగనాసుర అవినీతి, అరాచకాలకు అంతేలేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి మండిపడ్డారు. సోమవారం అనంతపురం అర్బన టీడీపీ కార్యాలయంలో పది తలల జగన చిత్రాన్ని ప్రదర్శించడంతోపాటు ఒక్కో తలను చింపేసి నిరసన వ్యక్తం చేశారు.

పదితలల జగనాసుర చరిత్ర ఫొటోలతో నిరసన చేపడుతున్న పరిటాలశ్రీరామ్‌, నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముఖ్యమంత్రి జగన.. వైసీపీ పాలనపై ఽధ్వజమెత్తిన టీడీపీ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన

అనంతపురం అర్బన: జగనాసుర అవినీతి, అరాచకాలకు అంతేలేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి మండిపడ్డారు. సోమవారం అనంతపురం అర్బన టీడీపీ కార్యాలయంలో పది తలల జగన చిత్రాన్ని ప్రదర్శించడంతోపాటు ఒక్కో తలను చింపేసి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు దేవళ్ల మురళి, డిష్‌ నాగరాజు, సరిపూటి రమణ, మారుతీకుమార్‌ గౌడ్‌, కూచి హరి, రాయల్‌ రఘు, గోపాల్‌ గౌడ్‌, తెలుగు మహిళలు విజయశ్రీరెడ్డి, శివబాల, సంగా తేజశ్విని, పద్మావతి, వెంకటలక్ష్మి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కేతిరెడ్డి అక్రమాలను బట్టబయలుచేస్తాం

ధర్మవరం, మే 1: కేతిరెడ్డి అక్రమాలకు బట్టబయలుచేస్తామని నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగనాసుర అవినీతి కార్యక్రమం పేరుతో టీడీపీ చేపట్టిన నిరసనకు ధర్మవరంలో పోలీసులు అడ్డు చెప్పారు. ముందుగా జగన దిష్టిబొమ్మదహనం చేయాలని భావించినా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పార్టీ కార్యాలయం లోపలే నిరసన తెలిపారు. పదితలలు ఉన్న జగన బొమ్మను చూపతూ జగనాసుర అవినీతి, నేరచరిత్రలోని ఒక్కొక్క అంశాన్ని చదువుతూ, ఒక్కొక్క తల చించుతూ ప్రజలకు వివరించారు. అనంతరం పరిటాలశ్రీరామ్‌ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చాక కేతిరెడ్డిని వదిలేది లేదని ఇసుక, మట్టిమాఫీయాలమీద సిట్‌ వేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కమతం కాటమయ్య, పణికుమార్‌, చింతలపల్లి మహేశచౌదరి, ముత్యాలప్పనాయుడు, నాగూర్‌హుస్సేన, పురుషోత్తంగౌడ్‌, అంబటిసనత, సాహెబ్బీ,బీబీ, పరిశేసుధాకర్‌, చిన్నరూవిజయ్‌చౌదరి, గంగార రవి, గోసలశ్రీరాములు, ఓంకార్‌,సంగాలబాలు, జంగం నరసింహులు, హోటల్‌మారుతిస్వామి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రం రావణ కాష్టం : పల్లె

పుట్టపర్తి, మే 1: ముఖ్యమంత్రి జగన రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నాడని మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి మండిపడ్డారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో రాష్ట్రంలో పదితలల జగనాసుర పాలన సాగుతోందంటూ పదితలలతో జగన చిత్రపటాన్ని తయారు చేసి నిరసన వ్యక్తం చేశారు. పల్లె మాట్లాడుతూ వైసీపీ నాలుగేళ్ల పరిపాలనలో హత్యలు, అత్యాచారాలు, యాసిడ్‌దాడులు, గ్యాంగ్‌రే్‌పలతో రాష్ట్రం రావణకాష్టంలా మారిందన్నారు. జగన ప్రజాపాలన కంటే సొంత సంపాదనమీదే ఎక్కువ దృష్టి కేంద్రీకరించారన్నారు. 20024లో చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సమష్టిగా కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రామాంజినేయులు, విజయ్‌కుమార్‌, శ్రీరామిరెడ్డి, సామకోటి ఆదినారాయణ, ఎల్‌ఐసీ నరసింహులు, పు ల్లప్ప, అంబులెన్సరమేశ, సాలక్కగారిశ్రీనివాసులు, సర్పంచ చిన్నపెద్దన్న, దేవానందరెడ్డి తదితరులుపాల్గొన్నారు.

రాష్ట్రంలో అసుర పాలన: కందికుంట

కదిరి, మే 1: రాష్ట్రంలో అసుర పాలన సాగుతోంది. ఈపాలనకు చమరగీతం పాడే రోజులు దగ్గపడ్డాయని టీడీపీ నియోజకవర్గ ఇనచార్‌ కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కోడికత్తి డ్రామాతో ప్రజల్లో సానుభూతి పొంది అధికారంలోకి వచ్చి, ప్రజలను అన్నివిధాల దోపీడీ చేస్తున్నాడని ముఖ్యమంత్రి జగనపై మండిపడ్డారు. అధికారంలోకి రావాలని సొంతబాబాయిని చంపి ఆనేరాన్ని చంద్రబాబుపై మోపడానికి ప్రయత్నించాడన్నారు. తల్లిని, చెల్లిని ఎన్నికల ముందు ప్రచారానికి ఉపయోగించుకుని, తరువాత అధికారంలోకి వచ్చాక, వారిని వెళ్లగొట్టిన ఘనుడు జగనరెడ్డి అని విమర్శించారు. సమావేశంలో టీడీపీ పట్టణాధ్యక్షులు డైమండ్‌ ఇర్షాన, నాయకులు శివరాంప్రతాప్‌, సులేమాన, రాజేంద్రనాయుడు, కెఎం ఖాదర్‌బాషా, రెడ్డెప్ప, రాజేఖర్‌బాబు, శేషు తదితరులున్నారు. అంతకుముందు రావణాసురుడి బొమ్మకు జగనాసుర అవినీతి, నేర రాక్షసులు అన్న బోర్డును తగలించి టీడీపీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు.

జగనాసుర రక్తచరిత్రకు సమాధి కడదాం

టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు

కంబదూరు (కళ్యాణదుర్గం రూరల్‌): జగనాసుర రక్తచరిత్రకు సమాధి కట్టే రోజులు దగ్గరపడ్డాయని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు హెచ్చరించారు. సోమవారం కళ్యాణదుర్గంలోని ఎన్టీఆర్‌ భవనలో ఆయన విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రావణాసురుడి పది తలల ఆకారంలో జగనరెడ్డి బొమ్మను తయారు చేసి ప్రదర్శించారు. జగనరెడ్డి ఈ నాలుగేళ్ల పాలనలో చేసిన అక్రమాలు, అవినీతిని వివరిస్తూ ఒక్కో తలను తుంచివేస్తూ ప్రసంగించా రు. సమావేశంలో మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన దొడఘట్ట నారాయణ, జిల్లా కార్యదర్శి తలారి సత్తి, పార్లమెంట్‌ అధికార ప్రతినిధి రామరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి బిక్కి గోవిందరాజులు, వడ్డె నాగరాజు, సుధాకర్‌, గోళ్ల ఎంపీటీసీ ఓబయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-02T00:13:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising