ఎంవైఆర్‌లో చంద్రబాబు నేడు బస
ABN, First Publish Date - 2023-08-02T00:19:26+05:30
మాజీ సీఎం చంద్రబాబు బుధవారం రాత్రికి జిల్లాకు చేరుకొని ఎంవైఆర్ ఫంక్షన హాల్‌లో బస చేస్తారు. ఆయన గురువారం ఉదయం జిల్లాలో పెండింగ్‌నున్న సాగు నీటి ప్రాజెక్టుల పరిశీలనకు బయలుదేరి వెళతారు.
ఏర్పాట్లపై నేతల పరిశీలన
అనంతపురం అర్బన, ఆగస్టు 1 : మాజీ సీఎం చంద్రబాబు బుధవారం రాత్రికి జిల్లాకు చేరుకొని ఎంవైఆర్ ఫంక్షన హాల్‌లో బస చేస్తారు. ఆయన గురువారం ఉదయం జిల్లాలో పెండింగ్‌నున్న సాగు నీటి ప్రాజెక్టుల పరిశీలనకు బయలుదేరి వెళతారు. కాగా అనంతపురం నగర శివారులోని ఎంవైఆర్ ఫంక్షన హాల్‌లో ఆయన బస ఏర్పాట్లపై మంగళవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు పలువురు టీడీపీ నాయకులతో కలిసి చర్చించారు. బస ఏర్పాట్ల పరిశీలనలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి, రాష్ట్ర కార్యదర్శులు తలారి ఆదినారాయణ, రామ్మోహనచౌదరి, శింగనమల ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, టీడీపీ బీసీ సెల్ నాయకులు దళావాయి వెంకటనారాయణ, సిమెంట్ పోలన్న తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-02T00:19:26+05:30 IST